హెచ్ఐవీ ఉందని చెప్పినా వినకుండా, డాబాపైకి తీసుకెళ్లి... అతిదారుణంగా...

ఆస్పత్రి బిల్లులో డిస్కాంట్ ఇప్పిస్తానని చెప్పి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. తనకు హెచ్‌ఐవీ వ్యాధి ఉందని చెప్పినా వినిపించుకోకుండా బాధితురాలిని వేధించాడు.

news18-telugu
Updated: May 15, 2019, 6:45 PM IST
హెచ్ఐవీ ఉందని చెప్పినా వినకుండా, డాబాపైకి తీసుకెళ్లి... అతిదారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 15, 2019, 6:45 PM IST
ముంబైలోని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పినా వినకుండా ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న తన చెల్లెలికి సహాయంగా ఆస్పత్రిలో ఉంటోంది ఓ మహిళ. తనకు ఇబ్బంది ఉన్నా... చెల్లెలికి సహాయంగా ఉండేందుకు మరెవరూ లేకపోవడంతో రాత్రి పగలు ఆస్పత్రిలోనూ ఉంటూ చెల్లెలికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చింది. అయితే ఆమెపై కన్నేసిన ఓ యవకుడు... మాయమాటలు చెప్పిన ఆమెపై లైంగిక దాడి చేయాలని ప్లాన్ చేశాడు.

ఇందులో భాగంగా బాధితురాలితో మాట మాట కలిపిన నిందితుడు...తాను అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని నమ్మించాడు. ఆమెకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశాడు. అందుకు ఆమె ఔనని సమాధానం చెప్పింది. ఆస్పత్రిలో పైఅంతస్తులో ఉన్న డిపార్ట్‌మెంట్‌లో ఫామ్ నింపితే మందులు, ట్రీట్మెంట్‌లో డిస్కౌంట్ ఇస్తారని బాధితురాలిని నమ్మించిన నిందితుడు... ఆమెను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శారీరికంగా బలహీనంగా ఉండటంతో... అతడిని ప్రతిఘటించలేకపోయింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సమీపంలోని సియాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా 31 ఏళ్ల దీపిక్‌ అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...