ఆరు నెలలుగా కూతురిపై అత్యాచారం... రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి...

కూతురికి భోజనంలో మత్తు మందు ఇవ్వడం ద్వారా ఆమెపై కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి.

news18-telugu
Updated: March 30, 2019, 11:37 AM IST
ఆరు నెలలుగా కూతురిపై అత్యాచారం... రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 11:37 AM IST
కన్న కూతురు అనే విచక్షణ మరిచిన ఓ తండ్రి... ఆమెపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు... కొన్ని నెలలుగా తనపై జరుగుతున్న ఈ దారుణం ఏ రకంగా వెలుగులోకి వచ్చిందనే విషయాన్ని పోలీసులకు వివరించింది. భార్య నుంచి విడిపోయిన 62 ఏళ్ల వ్యక్తి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తన మొదటి భార్య కుమార్తెను తన ఇంట్లోనే ఉండాలని కోరాడు. తండ్రి మాటలు విని సవతి తల్లితో కలిసి అతడితోనే ఉండిపోయిన బాధితురాలు... కొద్ది రోజుల నుంచి తనకు తెలియకుండా తనను ఎవరో ఏదో చేస్తున్నారనే అనుమానం వచ్చింది.

ప్రతి రోజూ తనకు దగ్గరుండి భోజనం పెట్టే తన తండ్రి... అందులో ఏదో కలిపి తనకు మత్తు వచ్చేలా చేస్తున్నాడని గమనించిన బాధితురాలు... ఒక రోజు బయట భోజనం చేసి యథావిథిగా తన రూముకు వెళ్లి పడుకుంది. అయితే ఎప్పటిలాగే కూతురిపై అత్యాచారం చేయబోయిన ఆమె తండ్రి... బాధితురాలు అరవడంతో అవాక్కయ్యాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పిన బాధితురాలు... ఆమె సాయంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...