హోమ్ /వార్తలు /క్రైమ్ /

చెరుకు రసం ఆశ చూపి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. యువకుడిపై అత్యాచారం -మగాణ్ని మగాడే: వారంలో రెండో ఘటన

చెరుకు రసం ఆశ చూపి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. యువకుడిపై అత్యాచారం -మగాణ్ని మగాడే: వారంలో రెండో ఘటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

man raped by another man : కామంతో కళ్లుమూసుకుపోయిన కీచకులు స్వలింగులనూ వదిలిపెట్టడంలేదు. అత్యాచార బాధితుల్లో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. తాజా ఘటనలో చెరుకు రసం తాగిస్తానని యువకుడికి ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే రాష్ట్రంలో వారం వ్యవధిలోనే రెండు రేప్ కేసులు నమోదు కావడం తాజా పరిస్థితిని తెలియజేస్తోంది..

ఇంకా చదవండి ...

కామోన్మాదులకు జెండర్ తో పనిలేదనేంతలా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. స్కూలుకు వెళ్లొస్తున్న బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అదే జిల్లాలో 20 ఏళ్ల యువకుడిని మరో వ్యక్తి రేప్ చేసి గాయపర్చిన ఉదంతం చోటుచేసుకుంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో రోజుల వ్యవధిలోనే ఈ రెండు సంఘటనలు జరగ్గా, వారం రోజుల కిందట బెల్గాం జిల్లాలో 24 ఏళ్ల యువకుడిపై మరోకడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాలివి..

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కబాక గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చినప్పుడు భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద అంటిఉండటంతో తండ్రి కంగారుపడ్డాడు. ఏం జరిగిందని అడగ్గా, ఆ కొడుకు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు..

రైతులకు శుభవార్త: వరికి మద్దతు ధర నిర్ధారణ -దొడ్డు వడ్లతోపాటు వానాకాలం పంట మొత్తాన్నీ కొంటాం: KCR సర్కార్


అదే గ్రామానికి చెందిన మొహ్మద్ హనీఫ్ తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్ కోసం బయటికెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ పలకరించాడు. తెలిసినవాడే కదాని యువకుడు కూడా మాట కలిపాడు. వాకింగ్ చేస్తున్నావుగా, చెరుకు రసం తాగిస్తానంటూ నమ్మబలికిన హనీఫ్.. ఆ నెపంతో యువకుణ్ని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

చివరికి బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు హనీఫ్ పై రేప్ కేసు పెట్టి అరెస్టు చేశారు. నిందితుడు హనీఫ్ పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు పెట్టామని, కోర్టులో శిక్ష పడేలా ఆధారాలు సేకిస్తున్నామని పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, బెల్గాం జిల్లాలో జరిగిన మరో సంఘటనలో..

దసరా విషాదం : అమ్మవారి విగ్రహా నిమజ్జనానికి పోతూ ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృతి -ముదిగొండలో ఘటన


బెల్గాం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడు అంతాని తాలూకా సంకొనట్టి గ్రామంలోని తన సోదరి ఇంట్లో ఉంటూ అంతానీ బస్టాండ్ వద్ద ఓ హోటల్ లో హెల్పర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 5న పని ముగించుకుని బస్సు కోసం ఎదురుచూస్తోన్న అతనికి.. గ్రామానికి చెందిన మరో వ్యక్తి తారాసపడ్డాడు. అక్క తొందరగా పిలుచుకురమ్మందంటూ యువకుణ్ని బైక్ మీద తీసుకెళ్లాడా వ్యక్తి. తీరా ఊరికి కాకుండా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఎలాగోలా ధైర్యం చేసిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితుడు రాజును పోలీసులు అరెస్టు చేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Karnataka, Rape case

ఉత్తమ కథలు