news18-telugu
Updated: December 3, 2020, 12:28 AM IST
ప్రతీకాత్మకచిత్రం
గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము..గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు. తాజాగా స్వదేశం తిరిగి వచ్చి ఓ మహిళ తన కష్టాలను మీడియా ముందు వెళ్లి బుచ్చుకుంది. దుబాయి అనగానే అందరికీ గుర్తొచ్చేది. అద్దాల మేడలు, కాసుల గల గలలు మాత్రమే కానీ, వాటి వెనుక ఉన్న చీకటి ప్రపంచం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎంతో మంది మహిళలు అక్కడ పనుల కోసం వెళ్లి, లైంగిక వేధింపులకు గురై చివరకు స్వదేశానికి బ్రతుకు జీవుడా అని చేరుకున్నారు. అలాంటి ఓ దీనగాథ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలానికి సునీత ( పేరు మార్చాం) వంట మనిషిగా పనిచేసేది. భర్త అకాల మరణంతో కుటుంబభారం మీద పడింది. కూతురు పెళ్లి కోసమని దాదాపు 3 లక్షల దాకా ఖర్చు కావడంతో, అక్కడా, ఇక్కడా అని చాలా చోట్ల అప్పులు చేసింది. తాను చేసే వంట పనితో ఇక అప్పులు తీర్చడం అసాధ్యమని భావించిన సునీత, ఎలాగైనా కష్టాల నుంచి బయటపడేందుకు, స్థానిక ఏజెంట్ ద్వారా దుబాయి వెళ్లి సంపాదించాలనుకుంది. అప్పుడే తన అప్పులు తీరుతాయని భావించింది. ఏజెంట్ ద్వారా హైదరాబాద్ చేరుకున్న సునీత తన ఇల్లు, పొలం, బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో దుబాయి ప్రయాణం అయ్యింది. అక్కడే స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ లో హౌస్ కీపర్ గా పనిచేసింది. మొదటి రెండు నెలల పాటు అదే రెస్టారెంట్ లో పనిచేసింది. అయితే ఆ రెస్టారెంట్ మూతపడటంతో, ఔట్ సోర్సింగ్ కంపెనీ వారు ఓ ఇంట్లో వంట మనిషి కింద ఉద్యోగం కుదిర్చారు. సునీత యూఏఈలోని ఓ షేక్ ఇంటలో పని కుదరింది. మొదట్లో ఆ ఇంట్లో అంతా బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ దుబాయి షేక్ కుమారుడు లండన్ నుంచి ఇంటికి వచ్చాడు. అతడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. నిత్యం పబ్స్, గర్ల్ ఫ్రెండ్స్ , మాదక ద్రవ్యాలతో మునిగి తేలే ఆ షేక్ తనయుడి కన్ను సునీతపై పడింది.
ఓ రోజు తన బెడ్రూంలో నుంచి సునీతకు టీ తీసుకురమ్మని ఆదేశించాడు. ఆమె వెంటనే టీ కప్పుతో భయం భయంగా అతడి గదిలోకి ప్రవేశించింది. ఆ షేక్ కుమారుడు డ్రగ్స్ తీసుకొని మైకంలో ఉన్నాడు. సునీతను ఒంటి మీద దుస్తులు తీసేయమన్నాడు. అందుకు సునీత నిరాకరించింది. దీంతో బెల్టు తీసకొని ఆమెను చితకబాదాడు. షేక్ కు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని ఆదేశించాడు. ఇక సునీత ఆ నరక బాధలు భరించలేకపోయింది. షేక్ కుమారుడు తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు ఆమెను గదిలోకి పిలిచి అత్యాచారం చేసేవాడు. ఆమెను మంచానికి కట్టేసి గంటల తరబడి సెక్స్ చేసేవాడు. అంతే కాదు తన స్నేహితులను పిలిచి సైతం సునీతపై అత్యాచారానికి దిగేవాడు.
ఈ నరకబాధలను సునీత ఏడాది పాటు భరించింది. ఒకే రోజు దాదాపు 12 మంది వరకూ సునీతను లైంగిక అవసరాలకు వాడుకునే వారు. పేదరికంతో సునీత వారిని కాదనలేక పోయింది. ఆమె అనారోగ్యం పాలవడంతో షేక్ కుటుంబం తమకు ఇంకో పనిమనిషి కావాలని, సునీతను తరిమిగొట్టేసింది. దీంతో ఆమె స్థానిక హోటల్ లో మరో ఆరు నెలల పాటు పనిచేసింది. చివరకు వీసా గడువు పూర్తి కావడంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చింది. తన వయస్సు కన్నా చాలా చిన్నవాడైన షేక్ కుమారుడు అలా పశువులా మీద పడి అనుభవిస్తున్నా...పేదరికంతో పాటు నిస్సహాయత తోడైన నరకం చూశానని వాపోయింది.
Published by:
Krishna Adithya
First published:
December 3, 2020, 12:28 AM IST