news18-telugu
Updated: November 15, 2020, 1:17 AM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మార్పులు రావడం లేదు. చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా హర్యానాలోని రేవారీలో తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగలేకపోవడంతో బాలికను భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే, బాలికపై కన్నేసిన భూతవైద్యుడు వైద్యం పేరిట బాలికకు మత్తుమందు ఇచ్చి 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అయితే, బాలికకు కడుపునొప్పి రావడంతో, తల్లిదండ్రులు వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. ఇంట్లో చెప్తే చెపేస్తానని బాలికకు దొంగబాబా బెదిరించినట్టు బాలిక పేర్కొన్నది. బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో తీవ్ర ఆగ్రహంతో బాలిక తల్లిదండ్రులు, దొంగబాబాపై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 15, 2020, 1:17 AM IST