బాలికపై మేనమామ అత్యాచారం... ఫోన్ కాల్‌తో దొరికిపోయిన వైనం

11 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: February 26, 2020, 6:33 PM IST
బాలికపై మేనమామ అత్యాచారం... ఫోన్ కాల్‌తో దొరికిపోయిన వైనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వావివరసలు మరిచిన ఆ మృగాడు ఏకంగా తన మేనకోడలు వరసయ్యే బాలికపైనే లైంగిక దాడికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వడ్లూరులోని ఓ కుటుంబానికి చెందిన పెద్ద రిక్షా తొక్కుకుని జీవనం సాగించగా అతడి భార్య స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తుంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కుమార్తె ఉంది. స్థానికంగా పాఠశాలలో చదువుతున్న బాలిక సాయంత్రం స్కూల్‌ విడిచిన తర్వాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఒంటరిగా ఉంటోంది. బాలిక ఒంటరితనాన్ని పసిగట్టిన వివాహితుడైన సమీప బంధువు నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటికి వచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.

జరిగిన విషయం ఎవరికి చెప్పొచ్చని బాలికను బెదిరించాడు నిందితుడు. దీంతో విషయాన్ని బాలిక భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. అప్పటినుంచి బాలిక తల్లిదండ్రుల ఫోన్‌కి నిందితుడు బాలిక కోసం ఫోన్‌లు చేస్తున్నాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బాలికతో నిందితుడికి ఫోన్‌ చేయించి అసలు విషయాన్ని రాబట్టి ఫోన్‌లో నిందితుడి వాయిస్‌ను రికార్డ్‌ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దిశ యాక్ట్‌ స్ఫూర్తిగా తీసుకుని వారం రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.


First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు