తెలంగాణలో దారుణం... పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

బాలికకు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

news18-telugu
Updated: January 19, 2020, 8:30 AM IST
తెలంగాణలో దారుణం... పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపై అత్యాచారాలకు చేస్తున్న నిందితులకను దోషులుగా తేల్చుతూ న్యాయస్థానాలు ఉరిశిక్షలు వేస్తున్నా... మానవ మృగాలు మాత్రం అబలలను వేటాడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. బాలికపై.... సాయి అనే 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆందోళనచెందారు. అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరాతీయగా... జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. దీంతో కాలనీవాసులు యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు