• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN PUSHES WIFE AND HIS DAUGHTERS INTO WELL DUE TO THE DAUGHTER WAS BORN AGAIN IN MADHYAPRADESH VB

Crime News: మళ్లీ కూతురు పుట్టిందని భార్య పిల్లలను బావిలో తోసేశాడు.. ఒడ్డుకు చేరుకుంటుండగా వాళ్లపై రాళ్లను విసిరాడు.. విషాద ఘటన ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: తనకు మళ్లీ కూతురు పుట్టిందని ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను తన ఇద్దరి పిల్లలను వ్యవసాయ బావిలో తోసేశాడు. భార్య కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి ఆమెను, చిన్న కూతరును కాపాడారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    అతడికి తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లయింది. అయితే మొదటి కాన్పుగా అమ్మాయి జన్మించింది. తర్వాత కొడుకు కవావాలనే ఉద్దేశ్యంతో మళ్లీ పిల్లల కోసం ప్రయత్నించలేదు. కాలం గిర్రున తిరిగింది.ఆ పిల్ల పెరిగి పెద్దదయింది. ఆమెకు ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలు. మరల దంపతులిద్దరు పిల్లల కోసం ప్రయత్నించారు. మూడు నెలల క్రితం వారికి మళ్లీ అమ్మాయి పుట్టింది. అతడు తట్టుకోలేక పోయాడు. తీవ్ర మనస్థాపానికి చెందాడు. కొడుకు పుడుతాడునుకుంటే ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగా, పెద్దకూతురు మరణించింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతార్పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఛతార్పూర్‌కు చెందిన రాజా బైయా యాదవ్‌ భార్య మూడు నెలల క్రితం ఓ ఆడపిల్లకి జన్మనిచ్చింది. వారికి అప్పటికే ఎనిమిదేండ్ల అమ్మాయి ఉంది. అయితే అతడు రెండో సంతానంగా కొడుకు పుడతాడని అనుకున్నాడు. అమ్మాయి కావడంతో నిరాశకు గురయ్యాడు. కాగా, డెలివరీ అయినప్పటి నుంచి అతని భార్య తన పుట్టింట్లో ఉంటున్నది. చిన్నారికి మూడు నెలలు నిండటంతో వారిని తన ఇంటికి తీసుకుపోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్యన అతడు పన్నా జిల్లాలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లాడు. భార్యా పిల్లలను తీసుకుని ఛతార్పూర్‌ బయల్దేరాడు. మార్గమధ్యంలో ఓ బావి వద్ద తన బైక్‌ను ఆపి భార్యా పిల్లలను అందులోకి తోసేశాడని పోలీసులు తెలిపారు.

    దీంతో ఎనిమిదేండ్ల అమ్మాయి చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. బావిలోనుంచి పైకి రావడానికి ప్రయత్నించిన భార్యపై రాళ్లు కూడా వేశాడని చెప్పారు. అయితే స్థానికులు ఆమె కేకలు విని ఆమెను రక్షించారని, రాజా యాదవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. కొడుకు పుట్టలేదన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
    Published by:Veera Babu
    First published: