news18-telugu
Updated: December 3, 2020, 12:52 AM IST
ప్రతీకాత్మకచిత్రం
కట్టుకున్న భార్యను తన స్నేహితులతోనే అత్యాచారం చేయించాడో ప్రబుద్ధుడు. అందుకు కారణం చెబుతూ, తన భార్య మరో మహిళతో స్వలింగ సంపర్కంలో ఉందని అందుకే అలా చేయించానని చెప్పుకొచ్చాడు. ఈ దారుణ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మింగ్ తన భార్య మేరీతో కలిసి జీవించేవాడు. ఇద్దరికీ వివాహమైన సుమారు 8 సంవత్సరాలైంది. అయితే మింగ్ తరచూ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటంతో మేరీ కూడా ఉద్యోగం చేసేది. అయితే ఆమె తరచూ పార్టీలకు వెళ్లేది అక్కడే ఆమెకు ఓ మహిళ పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య పరిచయం ఎక్కువై చివరకు లెస్బియన్ రిలేషన్ వైపు సాగింది. దీంతో ఆమె భర్తను పట్టించుకోవడం మానేసింది. ఇక భార్య తనను దగ్గరకు రానివ్వకపోవడం వెను స్వలింగ సంపర్కమే కారణమని గ్రహించిన మింగ్, వెంటనే ఆమెకు బుద్ధి చెప్పాలనకున్నాడు. తన స్నేహితులకు పరిస్థితి చెప్పగా, వారు. ఇక నీ భార్యను మాకు వదిలేయ్. ఆమెతో ఎలా వ్యవహరించాలో మేం చూసుకుంటామన ఓ రోజు రాత్రి అతని ఐదుగురు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారు.
నిజానికి పెళ్లికి ముందు ఆమె స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్) కాదు. కానీ భర్తతో 8 ఏళ్ల పాటు బలవంతంగా వైవాహిక జీవితాన్ని నెట్టుకొచ్చిన బాధితురాలు, చివరికి తన స్నేహితురాలితో కలిసి లెస్బియన్ గా మారింది. అంతేకాదు ఆమెతో సహజీవనం కూడా చేసింది. ఈ క్రమంలోనే తనను ఎందుకు వదిలేసి వెళ్లావని భర్త అడిగితే, తాను స్వలింగ సంపర్కురాలినని చెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత తీవ్రంగా కుమిలిపోయాడు. అతడు, తన స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. అనంతరం అతని కళ్ల ముందే, అతని అంగీకారంతోనే అతని ఐదుగురు స్నేహితులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆమె గర్భం దాల్చింది, అయితే తన బిడ్డకు ఆ ఐదుగురిలో తండ్రి ఎవరవుతారో ఆమెకు తెలియదు. ప్రస్తుతం అత్యాచారానికి గురైన మహిళ ఓ సంరక్షణ గృహంలో ఉంటున్నారు. లెస్బియన్ అన్న విషయాన్ని వెల్లడించడం వల్లనే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె అంటున్నారు.
Published by:
Krishna Adithya
First published:
December 3, 2020, 12:52 AM IST