• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN OUT ON PAROLE HELD FOR KILLING RAPING 3 YEAR OLD GIRL IN MAHARASHTRA SK

Rape and murder: 3 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన ఖైదీ.. జైలు నుంచి వచ్చి..

Rape and murder: 3 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన ఖైదీ.. జైలు నుంచి వచ్చి..

ప్రతీకాత్మక చిత్రం

Rape and Murder: ఓ రేప్ కేసులో ఆదేశ్ పాటిల్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఐతే 10 రోజుల క్రితం పెరోల్‌పై విడుదలయ్యాడు. అంతలోనే మరో దారుణానికి ఒడిగట్టాడు.

  • Share this:
    దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తెచ్చినా..ఉరిశిక్షలు విధిస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులని కూడా తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఘోరం జరిగింది. 3 ఏళ్ల బాలికు రేప్‌చేసి అతి కిరాతకంగా చంపేశాడో దుండగుడు. రాయ్‌గఢ్ జిల్లా పెన్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు.. అభంశుభం తెలియని చిన్నారిని దారుణంగా హత్య చేశాడు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 3 ఏళ్ల బాలిక తమ గుడిసెలో నిద్రించింది. దానికి తలుపులు లేవు. అదే సమయంలో అటుగా వచ్చిన ఆదేశ్ పాటిల్.. బాలికను ఎత్తుకెళ్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. మళ్లీ తనకేమీ తెలియనట్లుగా బాలిక మృతదేహాన్ని గుడిసెలో వదిలిపెట్టాడు. ఆ సమయంలో బాలిక నానమ్మ కంటపడ్డాడు. ఆమె గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది. వెంటనే అప్రమత్తమైన ఆదేశ్ పాటిల్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పెన్ చుట్టుపక్కలే అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

    ఓ రేప్ కేసులో ఆదేశ్ పాటిల్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఐతే 10 రోజుల క్రితం పెరోల్‌పై విడుదలయ్యాడు. అంతలోనే మరో దారుణానికి ఒడిగట్టాడు. అతడికి గతంలోనూ పెద్ద నేర చరిత్రే ఉంది. ఇళ్లల్లో దొంగతనాలు, దాడులు కేసులు అతనిపై నమోదయ్యాయి. ఎన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదు. తాజాగా మూడేళ్ల బాలికను రేప్ చేసి చంపేయడంతో అతడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు నిరసిస్తూ రాయగఢ్‌లో మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులను జైలు నుంచి ఎందుకు విడుదల చేశారంటూ మండిపడుతున్నారు. పసిపిల్లను ఛిదిమేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు