హోమ్ /వార్తలు /క్రైమ్ /

జూమ్ కాన్ఫరెన్స్‌లోనే తండ్రిని దారుణంగా చంపిన కొడుకు...

జూమ్ కాన్ఫరెన్స్‌లోనే తండ్రిని దారుణంగా చంపిన కొడుకు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూమ్ వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు.

జూమ్ వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో ఈ ఘటన జరిగింది. తమ కళ్లఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ఆ లైవ్ వీడియోను చూస్తున్న వారంతా ఒక్కసారిగా హఠాత్పరిణామానికి షాక్‌కు గురయ్యారు. అనంతరం అందులో చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైట్ పవర్స్ (72) అనే వ్యక్తి మీద కొడుకు స్కల్లీ పవర్స్ (32) హత్య చేశాడు. తండ్రి మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన అనంతరం స్కల్లీ పవర్స్ కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. ఆ సమయంలో అతడికి కూడా గాయాలు అయ్యాయి. జూమ్ కాన్ఫరెన్స్‌లో ఉన్న వారి నుంచి చాలా ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ గంట తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మీద హత్యా కేసు నమోదు చేశారు.

First published:

Tags: America, Crime news

ఉత్తమ కథలు