MAN ON TWO WHEELER DIES AFTER THROAT SLIT BY KITE CHINESE MANJA IN MANCHERIAL IN ANOTHER INCIDENT WOMAN DIES IN MP MKS
china manja: సంక్రాంతి విషాదం: గొంతు కోసేసిన గాలిపటం దారం.. ఇద్దరు మృతి
ప్రతీకాత్మక చిత్రం
గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా (China Manja) అస్సలు ఉపయోగించొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఈ ఏడాది కూడా దారుణ ఘటనలు జరిగాయి. గాలిపటానికి వాడిన దారం(చైనా మాంజా) మెడను కోసేయడంతో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒకరు, మధ్యప్రదేశ్ లో మరో యువతి ప్రాణాలు కోల్పోయారు.
సంక్రాంతి పర్వదినాన ఘోర విషాదాలు చోటుచేసుకున్నాయి. పతంగుల(గాలిపటాల) పండుగ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మాయదారి చైనా మాంజా ఓ వ్యక్తిని మరో యువతిని బలితీసుకుంది. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా (China Manja) అస్సలు ఉపయోగించొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఈ ఏడాది కూడా దారుణ ఘటనలు జరిగాయి. గాలిపటానికి వాడిన దారం(చైనా మాంజా) మెడను కోసేయడంతో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒకరు, మధ్యప్రదేశ్ లో మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. విరాలివి..
చైనా మాంజా విక్రయాలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. అయినాసరే అక్రమదారుల్లో చైనా మాంజా మార్కెట్లల్లో ఇంకా విచ్చలవిడిగా లభిస్తూనే ఉంది. చైనా మాంజా కారణంగా ఇప్పటికే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. తాజాగా మరో రెండు ప్రాణాలు పోయాయి. గాలి పటానికి ఉన్న (చైనా మాంజ) దారం తగిలి ఓ వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన సంక్రాంతి పండుగ రోజున తెలంగాణలోని మంచిర్యాల జిల్లా (Mancherial District) లో చోటుచేసుకుంది.
పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య గొంతు కోసుకోని పోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు,
మంచిర్యాల ఘటన మాదిరిగానే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సిటీలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా గొంతు కోయడంతో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయిని సిటీ మాధవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద మహిళ తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ రవీంద్ర వర్మ తెలిపారు. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.