అందమైన యువతిని భార్యగా చేసుకున్నాడు.. అయినా రంగప్ప ఇలా చేశాడంటే...

రంగప్ప, ఆషా

కర్ణాటకలో ఘోరం జరిగింది. అందంగా ఉన్న అమ్మాయిని భార్యగా చేసుకున్న ఓ భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పాలవాడితో, పేపర్‌వాడితో, కూరగాయలు అమ్మే వాడితో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడు. చివరికి.. ఆ భర్త అనుమానమే పెనుభూతమై భార్య ప్రాణాలను బలి తీసుకుంది. 28 ఏళ్లకే ఆమె ప్రాణాలు గాల్లో...

 • Share this:
  మండ్య: కర్ణాటకలో ఘోరం జరిగింది. అందంగా ఉన్న అమ్మాయిని భార్యగా చేసుకున్న ఓ భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పాలవాడితో, పేపర్‌వాడితో, కూరగాయలు అమ్మే వాడితో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడు. చివరికి.. ఆ భర్త అనుమానమే పెనుభూతమై భార్య ప్రాణాలను బలి తీసుకుంది. 28 ఏళ్లకే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పూర్తి వివరాల్లోకెళితే... మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లికి చెందిన రంగప్ప, ఆషా(28) భార్యాభర్తలు. పెళ్లైన కొత్తలో భార్యతో రంగప్ప అన్యోన్యంగా ఉండేవాడు. ఆమెను ప్రేమగా చూసుకునేవాడు. ఆమె చిన్నచిన్న సంతోషాలను కూడా గుర్తించి ఆమె ఆనందంగా ఉండేలా మసులుకునేవాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పిల్లలు పుట్టాక రంగప్ప ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భార్యపై అనుమానం మొదలైంది. ఆమె ఏ మగాడితో మాట్లాడినా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుందనే అనుమానించేవాడు. ఈ క్రమంలో.. ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.

  అనుమానం పెంచుకున్న భర్తతో ఆషా అంత చనువుగా ఉండలేకపోయింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకే ఇంట్లో ఉన్నా పలకరింపులు దూరమయ్యాయి. ఈ పరిణామం రంగప్పలో అనుమానం మరింత పెరిగేలా చేసింది. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం నడుపుతుందని భావించిన రంగప్ప ఈ విషయాన్ని బావ చంద్రతో చెప్పాడు. నాలుగు నెలల క్రితం రంగప్ప, అతని బావ చంద్ర కలిసి ఆషాను హతమార్చారు. ఆ తర్వాత అతి కిరాతకంగా కొడవలితో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. తన కూతురు కనిపించకపోవడంతో అల్లుడి ప్రవర్తనపై అనుమానంతో ఆషా తండ్రి గౌరిశంకర్ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగానే.. కృష్ణరాజపేట పోలీసులు గుర్తుతెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. గౌరిశంకర్ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో.. పోలీసులు ఆషా భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. భార్యను తానే చంపినట్లు రంగప్ప అంగీకరించాడు. కేవలం భర్త అనుమానం భార్య నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
  Published by:Sambasiva Reddy
  First published: