Home /News /crime /

MAN MURDERS HIS WIFE ON EXTRA MARITAL AFFAIR ISSUE IN TAMIL NADU TIRUPPUR DISTRICT SU

నా భార్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఒక్కసారి వెళ్లి చూడమని కిరాణా షాప్ ఓనర్‌కు చెప్పిన భర్త.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..

భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా షాప్‌కు ఫోన్ చేసి.. తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు. ఓ సారి ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు.

  ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా షాప్‌కు ఫోన్ చేసి.. తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు. ఓ సారి ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు. తీరా కిరాణా షాప్ ఓనర్ ఇంటికి వెళ్లేసరికి.. ఆ మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. అయితే ఈ కేసును విచారించిన పోలీసులు.. షాకింగ్ నిజాలను వెలికితీశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..తిరుప్పూర్ జిల్లా(Tiruppur District) అవినాశిలోని కామరాజ్ రోడ్ ప్రాంతంలో 35 ఏళ్ల విజయ్ నివాసం ఉంటున్నాడు. అతడు అవినాశి(Avinashi) సమీపంలోని రెడీమేడ్ గార్మెంట్స్ పార్కులో ఒక రెడీమేడ్ గార్మెంట్స్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి భార్య ప్రియ (30), ఇద్దరు కూతుళ్లు హాసిని(7), షాలిని(6) ఉన్నారు. అయితే ఆగస్టు 25వ తేదీన విజయ్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. ప్రియ తన ఇద్దరు కూతుళ్లను ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో వదిలి.. తిరిగి ఇంటికి వచ్చింది. అయితే మధ్యాహ్నం సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న కిరాణా దుకాణానికి ఫోన్ చేసిన విజయ్.. ఆ కిరాణా షాప్ యజమాని చిత్రతో తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు. ఒక్కసారి ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు.

  దీంతో చిత్ర.. వారి ఇంటికి వెళ్లి చూసింది. అయితే అక్కడ ఆమెకు షాకింగ్ సీన్ కనిపించింది. ప్రియ వంటింట్లో రక్తపు మడుగులో పడిపోయి కనిపించింది. దీంతో చిత్ర వెంటనే విజయ్‌కు సమాచారం అందించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అవినాశి పోలీసులు.. అక్కడి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్(Postmortem) నిమిత్తం తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రియ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టుగా, ఆమె దవడపై కత్తిగాటు, మెడపై స్వల్ప గాయాలు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

  వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి.. కుక్క పిల్లతో ఆడుకుంటున్న బాలిక.. అయ్యో పాపం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..

  ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. ఇది నగల కోసం చేసిన హత్యా..?, లేక కుటుంబ విబేధాల నేపథ్యంలో జరిగిన హత్యా..? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఘటన స్థలాన్ని పరీక్షించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ఈ కేసులో షాకింగ్ నిజాలను వెలికి తీశారు.

  విజయ్‌కు అప్పటికే వివాహ జరిగిందని.. విడాకులు తీసుకున్న అనంతరం ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రియను వివాహం చేసుకున్నాడని తేలింది. గత 9 ఏళ్లుగా అతడు ప్రియతో జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రియకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆమె అతనితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేంది. మరోవైపు మద్యంపానం విషయంలో విజయ్, ప్రియల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇక, బుధవారం విజయ్ పనికి వెళ్లాడు. అక్కడి నుంచి ప్రియకు ఫోన్ చేశాడు. విజయ్ కాల్ చేస్తున్నప్పటికీ.. కాల్ వెయింటింగ్‌ను పట్టించుకోకుండా ప్రియ వేరే వాళ్లతో మాట్లాడుతూనే ఉంది. దీంతో విజయ్ ఎలాగైనా ప్రియను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.

  అనుమానం రాకుండా దందా.. ముఠాలో యువతులు కూడా.. ఇంతకీ వీరు ఏం చేస్తున్నారంటే..

  ఈ క్రమంలోనే ఇంటికి వచ్చి ప్రియతో గొడవపడి.. ఆమెను హత్య చేశాడు. అనంతరం ప్రియను ఎవరో చంపినట్టుగా నమ్మించేందుకు డ్రామా మొదలుపెట్టాడు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసేసి.. తిరిగి పనికి వెళ్లాడు. ఆ తర్వాత కిరాణా షాపు యజమాని చిత్రకు ఫోన్ చేసి.. ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు. ఇలా తనకేమీ తెలియనట్టుగా భార్యను ఎవరో చంపేసినట్టుగా వ్యవహరించాడు. అయితే చిరవకు పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Husband kill wife, Tamil nadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు