బావమరిదిని గొంతు కోసి చంపిన బావ.. ఆదిలాబాద్‌లో దారుణం

టీ తాగుదామని మనోజ్‌ను బయటకు తీసుకెళ్లిన సంతోష్.. బావ మరిదిని దారుణంగా చంపేశాడు. నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి హతమార్చాడు.

news18-telugu
Updated: November 14, 2019, 10:08 PM IST
బావమరిదిని గొంతు కోసి చంపిన బావ.. ఆదిలాబాద్‌లో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మంచి బుద్ధులు చెప్పిన బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. నువ్వేంట్రా..నాకు చెప్పేదంటూ కత్తితో గొంతు కోసి హతమార్చాడు. ఏడాది క్రితం నాటి గొడవను మనసులో పెట్టుకొని కిరాతకంగా అంతమొందించాడు. ఆదిలాబాద్‌ టౌన్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానిక సుందరయ్యనగర్ ప్రాంతంలో మమత, సంతోష్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాలతో వీరిద్దరి మధ్య ఏడాది క్రితం గొడవ జరిగింది. ఐతే ఈ విషయంలో మహారాష్ట్రలో ఉండే మమత సోదరుడు మనోజ్ కలగజేసుకున్నాడు.

బావకు నచ్చజెప్పే క్రమంలో పలుమార్లు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు మనోజ్. ఐనా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మమత మహారాష్ట్రలో ఉండే తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిన కొన్నాళ్లుకు అత్తింటికి కాల్ చేశాడు సంతోష్. తాను మారిపోయానని.. మమతను కాపురానికి పంపించాలని కోరాడు. అతడిని మాటలను నమ్మి మమతను మళ్లీ కాపురానికి పంపించారు. అప్పటి నుంచి ఏడాది కాలంగా భార్యతో బాగానే ఉంటున్నాడు సంతోష్. ఐతే తన బావమరిది విషయం మాత్రం అతడికి నచ్చలేదు. చిన్నవాడైన మనోజ్ తనకు నీతులు చెప్పడమేంటని మనసులో పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల అక్కను చూసేందుకు ఆదిలాబాద్‌కు వచ్చాడు మనోజ్. ఐతే టీ తాగుదామని మనోజ్‌ను బయటకు తీసుకెళ్లిన సంతోష్.. బావ మరిదిని దారుణంగా చంపేశాడు. నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి హతమార్చాడు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున జనం గూమికూడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనోజ్ మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...