భార్య సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఆమె కుటుంబసభ్యులు దారుణంగా హత్యచేశారు. నడిరోడ్డుపై కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు..ముషీరాబాద్‌కు ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మునవర్ ఖాద్రి(27), చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన యువతితో ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప, ఇటీవలే జన్మించిన బాబు ఉన్నారు.
అయితే కొద్దికాలంగా సయ్యద్.. భార్య సోదరితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతన్ని పద్దతి మార్చుకోవాల్సిందిగా మందలించారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం సయ్యద్, మరదలితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి.. కొద్ది రోజులకు తిరిగివచ్చారు. ఆ తర్వాత కూడా వీరి బంధం కొనసాగుతూనే ఉంది.
ఈ విషయంపై మాట్లాడటానికి సయ్యద్ భార్య కుటుంబ సభ్యులు అతన్ని ఇంటికి పిలిచారు. అయితే ఈ సదర్భంగా వారి మధ్య ఘర్ష చోటుచేసుకుంది. ఈ క్రమంలో సయ్యద్ కాళ్లు, చేతులు కట్టేసి.. రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు. అనంతరం మటన్ కోసే కత్తితో గొంతు కోసం అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.