TikTok: టిక్‌టాక్‌‌లో అసభ్య హావభావాలు.. భార్యను భర్త ఏం చేశాడంటే..

TikTok: టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది.

Bommakanti Shravan | news18-telugu
Updated: June 2, 2019, 12:35 PM IST
TikTok: టిక్‌టాక్‌‌లో అసభ్య హావభావాలు.. భార్యను భర్త ఏం చేశాడంటే..
నందిని, కనకరాజ్
Bommakanti Shravan | news18-telugu
Updated: June 2, 2019, 12:35 PM IST
టిక్‌టాక్.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ తనకు బందీ చేసుకొంది. నిజంగా చెప్పాలంటే.. ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది. టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వెలినగర్‌ ప్రాంతానికి చెందిన కనకరాజు(35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడికి నందిని(28) భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవ కారణంగా ఇద్దరు విడిపోయి ఉంటున్నారు. నందిని తన ఇంటికి దగ్గరలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. అయితే, నందిని టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలు చూపుతూ పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇది తెలుసుకున్న కనకరాజు ఆమెకు ఫోన్ చేసి మందలించాడు. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మానేయాలని, కాపురానికి వచ్చి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు. అది పట్టించుకోకుండా నందిని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేస్తే బిజీ వచ్చింది.

దీంతో కోపంతో ఊగిపోయిన కనకరాజు.. అదే రోజు ఫుల్లుగా మందేసి నందిని పనిచేస్తున్న కళాశాల వద్దకు వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఆవేశానికి గురయ్యాడు. తనతో తీసుకెళ్లిన కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నందినిని సహచర ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.



First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...