Home /News /crime /

MAN MURDERED HER AUNT FOR ILLEGAL RELATIONSHIP IN ELURU SB

ఏలూరులో దారుణం... అత్తతో మేనల్లుడి రాసలీలలు చివరకు ఏమైంది ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వరుసకు మేనల్లుడైన సంతోష్‌ అనే యువకుడితో చనువు పెరిగింది. దీంతో ఆ పరిచయం కాస్త పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వారిద్దరు తరుచూ రాసలీలలు సాగించేవారు.

    అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తాయని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. వరుసకు అత్త అయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ యువకుడు. అఆతర్వాత ఆమెపై చనువు పెరిగి అనుమానించాడు. ఆ తర్వాత వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా చివరకు ఆమెనే హతమార్చాడు. ఈ దుర్ఘటన ఏపీలోని ఏలూరులో చోటు చేసుకుంది. శనివారపుపేటకు చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణి(34) అనే మహిలతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. శివాజీ మానసిక వికలాంగుడు కావడంతో ఇంటి వద్దనే ఉండేవాడు. దీంతో నాగమణి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు వరుసకు మేనల్లుడైన సంతోష్‌ అనే యువకుడితో చనువు పెరిగింది. దీంతో ఆ పరిచయం కాస్త పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వారిద్దరు తరుచూ రాసలీలలు సాగించేవారు.

    అయితే ఇటీవల నాగమణి ప్రవర్తనపై సంతోష్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరొకరితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించి వేధించేవాడు. దీంతో నాగమణి అతడిని కొద్దిరోజులుగా దూరం పెట్టేసింది. దీంతో తట్టుకోలేకపోయిన సంతోష్ నాగమణిని అంతంమొందించాలనుకున్నాడు. తెలివిగా నాగమణిని హత్యచేసాడు. తనతో అక్రమ సంబంధం కొనసాగించక పోవడం వల్లే సంతోష్‌ ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    ఇదికూడా చూడండి:
    చిన్నారికి చెత్త గిఫ్ట్ ఇచ్చిన తల్లి

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Illegal affairs, Illegal relationship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు