హోమ్ /వార్తలు /క్రైమ్ /

భార్య చెల్లెలిపై కన్నేసిన వ్యక్తి.. నిద్రపోతున్న సమయంలో పక్కా ప్లాన్‌తో..

భార్య చెల్లెలిపై కన్నేసిన వ్యక్తి.. నిద్రపోతున్న సమయంలో పక్కా ప్లాన్‌తో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్య చెల్లెలి మీద కన్నేసిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు.

భార్య చెల్లెలి మీద కన్నేసిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. తీరా అందుకు అంగీకరించకపోవడంతో.. మరదలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువతి చావుబుతుకుల మధ్య పోరాడుతుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని గట్టుకిందపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కదిరి శివన్న, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో రెండో కూతురు మాధవిని తొమ్మిదేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన వెంకటేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వెంకటేశ్, మాధవి దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్నేళ్లకు వెంకటేశ్‌లోని మృగాడు నిద్రలేచాడు. తన మరదలు సుమతి(24)పై కన్నేశాడు. ఓ ప్రవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న ఆమెపై వేధింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమె వెంటపడ్డాడు. దీంతో కొన్ని నెలల కిందట సుమతి ఆత్మహత్యకు యత్నించింది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెంకటేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వెంకటేశ్ తన భార్య మాధురి, కుమారుడిని గట్టుకిందపల్లెలో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇటీవల సుమతి తల్లిదండ్రులు ఆమె పెళ్లి సంబంధం కుదిర్చారు. డిసెంబర్ 25న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తెలుసుకున్న వెంకటేశ్ మరదలిపై కోపాన్ని పెంచుకున్నాడు. తనను ఎలాగైనా హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం భారీ ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం గురువారం తెల్లవారుజామూన నిద్రపోతున్న సుమతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సుమతిని తొలుత సమీపంలోని పీహెచ్‌సీ తరలించారు. అక్కడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ముందుగా ఇంటివద్ద ఉన్న పెంపుడు కుక్కలు తనను చూసి అరవకుండా వాటిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. అందుకోసం విషం కలిపిన అన్నాన్ని ఇంటి చుట్టూ వేశాడు. ఆ అన్నం తిన్న మూడుకుక్కలు, ఒక పిల్లి, మరో 30 కోళ్లు చనిపోయాయి. ఈ ఘటనతో పెళ్లి వేడుకలు జరగాల్సిన ఆ కుటుంబం.. విషాదంలోకి జారుకుంది. ఈ ఘటనతో గ్రామస్థులూ ఒక్కసారిగా భయాందోళన చెందారు. పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

First published:

Tags: Chittoor, Crime news, Murder attempt

ఉత్తమ కథలు