లక్షన్నర కోసం భార్యను తాకట్టు పెట్టిన భర్త...డబ్బు చెల్లించే వరకు పడక సుఖం ఇచ్చేలా ఒప్పందం...

తమ భర్తలే రూ.1.5లక్షల కోసం తనఖా పెట్టినట్లు తెలుసుకొని షాక్ అయ్యారు. ఇంటికి వెళ్లి.. భర్త, అత్తమామలను వారు నిలదీయగా.. పుట్టింటికి వెళ్లి ఇద్దరూ చెరో రూ.5లక్షలు తేవాలని లేకపోతే.. అప్పు ఇచ్చిన వారితో శృంగారం చేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు.

news18-telugu
Updated: May 24, 2020, 9:27 PM IST
లక్షన్నర కోసం భార్యను తాకట్టు పెట్టిన భర్త...డబ్బు చెల్లించే వరకు పడక సుఖం ఇచ్చేలా ఒప్పందం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కోల్‌కతాలో ఇద్దరు అన్నదమ్ములు దారుణానికి పాల్పడ్డారు. జల్సాలకు కట్టుకున్న అలవాటు పడ్డ దుర్మార్గులు అప్పు కోసం భార్యలని ఓ వ్యక్తికి తాకట్టు పెట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ కు చెందిన మహిళలు..కోల్‌కతాకు చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లను 2018లో పెళ్లాడారు. అయితే ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన వారికి జీవితం నరకంగా మారింది. ఇంటి అప్పుతీర్చేందుకు ఆ ఇద్దరు మహిళలను వారి భర్తలు.. తమకు అప్పు కోసం తాకట్టు పెట్టేశారు. ఇక అప్పు ఇచ్చిన వ్యక్తికి కావాల్సినప్పుడల్లా .. ఈ ఇద్దరు మహిళలు.. అతని పడక సుఖం తీర్చేలా వారి భర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు ఇవేమీ తెలియని ఆ మహిళలు.. అప్పు ఇచ్చిన వాడి కామానికి బలయ్యారు. కొద్ది నెలల క్రితం.. ఆ వ్యక్తి మహిళలనును వేరే ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు.

ఇదేమిటని నిలదీయగా.. తమ భర్తలే రూ.1.5లక్షల కోసం తనఖా పెట్టినట్లు తెలుసుకొని షాక్ అయ్యారు. ఇంటికి వెళ్లి.. భర్త, అత్తమామలను వారు నిలదీయగా.. పుట్టింటికి వెళ్లి ఇద్దరూ చెరో రూ.5లక్షలు తేవాలని లేకపోతే.. అప్పు ఇచ్చిన వారితో శృంగారం చేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు ఇటీవల గర్భం దాల్చారు. దీంతో.. ఆమెను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా అత్తమామలు ఒత్తిడి చేశారు. దీంతో.. బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 24, 2020, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading