Home /News /crime /

MAN MOLESTED ON 13 YEARS MINOR GIRL IN MUMBAI PAH

OMG: తెలిసిన వాడే కదా ఇంటికి రానిస్తే.. ప్రతి రోజు అదే పాడు పని.. బాలికకు మాయమాటలు చెప్పి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shocking: ముంబైలో దారుణం జరిగింది. ఒక కామాంధుడు మైనర్ బాలికకు మాయమాటలు చెప్పాడు. ఇంటి పక్కనే ఉండటంతో బాధితురాలు అతని మాటలు నమ్మింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ప్రతి రోజు ఆమెపై తన కామావాంఛను తీర్చుకునేవాడు.

Molested On Minor Girl: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విషాదకర మైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆంటోప్ హిల్ పరిధిలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై..  పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తి  కొంత కాలంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో  బాలికకు.. కొద్ది రోజులుగా శరీరంలో మార్పులు , కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె ఐదునెలల గర్బవతి అని చెప్పారు. దీంతో ఆమె కుటుంబం షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత.. 13 ఏళ్ల మైనర్ బాలిక జరిగిన దారుణాన్ని తన వాళ్లతో పంచుకుంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.





పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతంలో 25 ఏళ్ల వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వారు ఉంటున్న వీధిలో ఒక బాలిక ఉంది. ఇతను బాలికపై కన్నేశాడు. ఒకే వీధిలో ఉండటంతో ఇంట్లో వారు కూడా ఎమి అనుకునే వారు కాదు. దీన్ని ఆ కామాంధుడు క్యాష్ చేసుకున్నాడు. బాలికను తన వలలో వేసుకున్నాడు. ప్రతి రోజు బాలిక ఇంటికి వెళ్లి ఎవరు లేనిది చూసుకుని ఆమె పై అఘాయిత్యానికి పాల్పడేవాడు.

దాదాపు ఐదు నెలలుగా అతను అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. దీంతో బాధితురాలికి.. కడుపు నొప్పి రావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు పరీక్షించిన లు చేసిన వైద్యులు గర్బవతి అని తేల్చారు. దీంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు