• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN MARRIED SIX WOMENS AND SENSAIONAL MATTERS CAME TO LIGHT FOR THE POLICE DURING THE INVESTIGATION VB

Man Married Six Womens: ఆరుగురిని పెండ్లాడిన నిత్య పెళ్లికొడుకు.. దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

Man Married Six Womens: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ష‌హ‌నాజ్‌పూర్‌కు చెందిన ఓ దొంగ బాబా ఆరుగురు మ‌హిళ‌ల‌ను వివాహం చేసుకున్నాడు. ఒకిరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆరో పెండ్లి విష‌యం తెలుసుకున్న ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఆ బాబా బాగోతం బ‌య‌ట‌ప‌డింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

  • Share this:
    పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఓ తియ్యని క్షణం. పెళ్లి అనే బంధంతో ఒక్కటైన దంపతులు చచ్చేవరకు తోడుగా కలిసి ఉండాలనేది నానుడి. అదే ఆలుమగల బంధం. స్వచ్ఛమైన ప్రేమతో భార్యభర్తల బంధానికి సరైన అర్థం అదే. కానీ ఓ బాబా ఒకరికి తెలియకుండా మరొకరని మోసం చేస్తూ ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.  షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్‌ చేతన్‌ కథేరియా అనే వ్యక్తికి 2005లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు బాగానే కాపురాం చేశారు. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ఇద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకులు పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగానే 2010లో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ కూడా కావాలనే భార్యతో గొడవలు పెట్టుకున్నాడు. దీంతో ఆమె తట్టుకోలేక అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. తర్వాత ఐదేళ్ల తర్వాత 2015లో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా మోసం చేసి మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకున్నాడు.

    నాలుగో వివాహం చేసుకున్న తర్వాత తన బంధువుల ద్వారా అతడి విషయం తెలుసుకొని తనలో తాను కుమిలిపోయింది. ఓ రోజు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అతడు మళ్లీ 2019లో మరో మహిళతో ఐదో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్‌ నుంచి వేరుగా ఉండ సాగింది. కొద్ది రోజుల క్రితం అనూజ్ ఆరో పెండ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్‌ చేశారు.

    కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనూజ్‌ మ్యాట్రిమోనియల్‌ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్‌, టీచర్‌, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్‌లు ఇస్తూ.. మహిళలను మోసం చేసేవాడనని వెల్లడించాడు.
    Published by:Veera Babu
    First published: