భార్యను ఉగ్రవాది చేసి... పోలీసులకు భర్త ఫోన్

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టేందుకు వెళ్తున్నట్లు సమాచారం అందించాడు. దుబాయి లేదా సౌదీ అరేబియా వెళ్లే విమానాన్ని పేల్చేసేందుకు ఆమె యత్నిస్తున్నట్లు తెలిపాడు.

news18-telugu
Updated: August 18, 2019, 8:36 AM IST
భార్యను ఉగ్రవాది చేసి... పోలీసులకు భర్త ఫోన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ భర్త తన స్వార్థానికి భార్యనే వాడేసుకున్నాడు. తనను విడిచి విదేశాలకు వెళ్లిపోతుందని...ఏకంగా ఆమెను ఉగ్రవాదిని చేసేశాడు.ఈ ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. ఆగస్టు 8న ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఓ ఆగంతకుడు ఫోన్‌ చేసి తన భార్య ఫిదాయిన్‌(ఆత్మహుతి దాడికి పాల్పడే ఉగ్రవాది) అని చెప్పాడు.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టేందుకు వెళ్తున్నట్లు సమాచారం అందించాడు. దుబాయి లేదా సౌదీ అరేబియా వెళ్లే విమానాన్ని పేల్చేసేందుకు ఆమె యత్నిస్తున్నట్లు తెలిపాడు.

దీంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులను అలర్ట్ చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. దీంతో ఆ ఫోన్‌కాల్‌ పై విచారణ జరిపిన పోలీసులు నిజం తెలిసి కంగుతిన్నారు. భార్య విదేశాలకు వెళ్లకుండా ఆపేందుకు ఓ వ్యక్తి ఈ ఫోన్‌ కాల్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

చెన్నైలో ఓ బ్యాగుల తయారీ సంస్థ యజమాని అయిన నజీరుద్దీన్‌ తన దగ్గర పనిచేసే రఫియా అనే యువతిని కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఇటీవల రఫియా గల్ఫ్‌కు వెళ్లి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అయితే భార్య తనను విడిచి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేని నజీరుద్దీన్‌ ఎలాగైనా ఆమెను ఆపాలని ప్లాన్ చేశాడు. అందుకే భార్యను ఉగ్రవాదిని చేసి పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే నజీరుద్దీన్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో చివరకు కటకటాల పాలయ్యాడు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...