హోమ్ /వార్తలు /క్రైమ్ /

మద్యం షాపులు తెరుస్తారని ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్

మద్యం షాపులు తెరుస్తారని ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మద్యం షాపులు తెరుచుకుంటాయని ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు పదే పదే ప్రకటించారు. అలాంటి వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ఈ క్రమంలోనే గత ఆదివారం నుంచి మద్యం షాపులు తెరిచేందుకే ప్రభుత్వం నిర్ణయించిందని ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన సన్నీ అనే యువకుడు ఈ రకమైన ప్రచారానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు... అతడిని అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి పంపించారు. నిందితుడు మద్యం షాపులు తెరబోతున్నారంటూ ఎక్సైజ్ శాఖ తయారు చేసినట్టుగా ప్రచారంలోకి వచ్చిన ఫేక్ జీవోను రూపొందించిన సంగతి తెలిసిందే. మద్యం షాపులు తెరవబోతున్నట్టు ప్రచారం జరగడంతో... అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Hyderabad police, Telangana, Wine shops

    ఉత్తమ కథలు