• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN LOST HIS JOB AND UNABLE TO REPAY THE LOAN LEADS TO MURDER FINANCE EMPLOYEE IN PUNE HSN

లోన్ చెల్లించమంటూ ఫైనాన్స్ ఉద్యోగి ఫోన్.. తీవ్ర వాగ్వాదం.. ఆ వ్యక్తి నేరుగా ఫైనాన్స్ ఆఫీసుకు వెళ్లి ఎంతకు తెగించాడంటే..

లోన్ చెల్లించమంటూ ఫైనాన్స్ ఉద్యోగి ఫోన్.. తీవ్ర వాగ్వాదం.. ఆ వ్యక్తి నేరుగా ఫైనాన్స్ ఆఫీసుకు వెళ్లి ఎంతకు తెగించాడంటే..

మరణించిన ఫైనాన్స్ ఉద్యోగి రవీంద్ర

కరోనా దెబ్బకు ఉద్యోగం పోవడంతో ఈఎమ్ఐ చెల్లింపులకు డబ్బుల్లేకుండా పోయాయి. ఓ వైపు ఈఎమ్ఐ చెల్లించమంటూ లోన్ ఇచ్చిన వాళ్ల నుంచి ఫోన్లు రావడం ఎక్కవయింది. దీంతో అతడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. లోన్ చెల్లించమంటూ తనకు ఫోన్ చేసిన ఆఫీసుకు వెళ్లి..

  • Share this:
    కరోనా మహమ్మారి వల్ల అతడి ఉద్యోగం పోయింది. రోజూ కుటుంబాన్ని పోషించుకునేందుకే అతడికి కష్టంగా మారింది. అయితే అంతకుముందే అతడు ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాడు. కరోనా రాకముందు వరకు లోన్ ఈఎమ్ఐ బాగానే చెల్లించాడు. కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో అతడికి ఏం చేయాలో తెలియలేదు. కొద్ది నెలల పాటు ఈఎమ్ఐ చెల్లింపుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అతడికి ఊరట లభించింది. కానీ ఆ తర్వాతే అతడికి ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటికీ ఏ ఉద్యోగంలో చేరకపోవడంతో ఈఎమ్ఐ చెల్లింపులకు డబ్బుల్లేకుండా పోయాయి. ఓ వైపు ఈఎమ్ఐ చెల్లించమంటూ లోన్ ఇచ్చిన వాళ్ల నుంచి ఫోన్లు రావడం ఎక్కవయింది. దీంతో అతడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. లోన్ చెల్లించమంటూ తనకు ఫోన్ చేసిన ఫైనాన్స్ ఉద్యోగిని చంపేశాడు. పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    మహారాష్ట్రలోని పుణె నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉరిలీ కంచన్ అనే గ్రామం ఉంది. అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 28 ఏళ్ల రవీంద్ర వాల్కుండే అనే వ్యక్తి సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆ పైనాన్స్ బ్రాంచ్ నుంచి 27ఏళ్లా రాహూల్ లక్ష్మణ్ గాధ్వే అనే వ్యక్తి 98 వేల రూపాయల లోన్ తీసుకున్నాడు. కరోనా ప్రభావంతో అతడు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో లోన్ ఈఎమ్ఐ చెల్లింపుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు ఉద్యోగం లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, మరో వైపు తీసుకున్న లోన్ ను చెల్లించలేకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. లోన్ ఈఎమ్ఐలను చెల్లించమంటూ రవీంద్ర నుంచి ఎన్నోసార్లు ఫోన్లు వచ్చాయి. అయినప్పటికీ రాహూల్ సరైన రీతిలో స్పందించలేదు.
    ఇది కూడా చదవండి: ప్రేయసిని ఇంటికి తీసుకొచ్చేసిన యువకుడు.. భార్యాభర్తలుగా కొత్త లైఫ్.. 15 రోజుల్లోనే విషాదం

    మంగళవారం ఉదయం కూడా రాహూల్ కు రవీంద్ర ఫోన్ చేశాడు. లోన్ ఎప్పుడు చెల్లిస్తావంటూ అడిగాడు. ’ప్రస్తుతం నా దగ్గర డబ్బుల్లేవు. నన్నేం చేయమంటారు. ఉన్నప్పుడు కడతాను‘ అంటూ రాహూల్ తేల్చిచెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తీవ్రమైన వాదులాట జరిగింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రవీంద్ర ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చాడు. అప్పటివరకు కనిపించకుండా దాక్కున్న రాహూల్ ఒక్క ఉదుటున చాటు నుంచి బయటకు వచ్చి రవీంద్రపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో రవీంద్ర అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై లోని కల్భోర్ పోలీస్ స్టేషన్ లో రవీంద్ర సహోద్యోగి కేసు పెట్టాడు. ప్రత్యక్ష సాక్షినని తెలిపాడు. దీంతో రాహూల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. రాహూల్ కు నాలుగు రోజులు రిమాండ్ విధించారు.
    ఇది కూడా చదవండి: శునకంపై అత్యాచారం.. అర్ధరాత్రి ఓ యువకుడి నిర్వాకం.. చాటుగా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన కుర్రాళ్లు.. చివరకు..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు