హోమ్ /వార్తలు /క్రైమ్ /

కల నిజమైంది.. జ్యోతిష్యుడి సలహా విని పాముతో కరిపించుకొని నాలుక పోగొట్టుకున్నాడు

కల నిజమైంది.. జ్యోతిష్యుడి సలహా విని పాముతో కరిపించుకొని నాలుక పోగొట్టుకున్నాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man loses tongue to snake bite : నిద్రలో కలలు(Dreams) రావడం చాలా సహజం. మనలో చాలామందికి ఎప్పుడూ ఏవో కలలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మంచి కలలు,కొన్ని పీడకలలు వస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Man loses tongue to snake bite : నిద్రలో కలలు(Dreams) రావడం చాలా సహజం. మనలో చాలామందికి ఎప్పుడూ ఏవో కలలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మంచి కలలు,కొన్ని పీడకలలు వస్తాయి. కొందరు వాటిని పట్టించుకోరు,మరికొందరు వాటిని సీరియస్ గా తీసుకుంటారు. అయితే తమిళనాడు(Tamilnadu)లోని ఓ వ్యక్తి తనకు వచ్చిన కలను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. దీంతో అతని కల నిజమైంది. ఫలితంగా నాలుక(Tongue)ను కోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్(Erode) జిల్లాలోని గోబిచెట్టియపాలెంకు చెందిన రాజా(పేరు మార్చాం)54 ఏళ్ల వ్యక్తికి ..ఓ పాము తనని కాటేసినట్లు తరచుగా కల వస్తుండేది. దీనిని అతడు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. దీంతో ఇటీవల ఓ జ్యోతిష్యుడిని కలిసి తన కల గురించి అతడికి చెప్పాడు. దీంతో వెంటనే జ్యోతిష్కుడు రాజాకి ఓ సలహా ఇచ్చాడు. అదేంటంటే.. ఓ పాముకి పూజ చేస్తే నువ్వు ఈ ప్రమాదం నుంచి బయటపడగలవు అని ఆ జోత్యిష్యుడు సలహా ఇచ్చాడు. అంతేకాకుండా, పాము సంచరించే ఓ ఆలయం దగ్గరకి వెళ్లి ఆ పని చెయ్యి అని కూడా సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడి సలహాతో రాజా ఆలయం దగ్గరకు వెళ్లాడు. ఆ ఆలయ పూజారి..జ్యోతిష్యుడి సలహాకు మరింత పవిత్రత చేకూర్చేలా పూజ అయిన తర్వాత నీ నాలుకను పాముకి చూపించు అని రాజాకి చెప్పాడు. పూజారి సలహా మేరకు పూజ తర్వాత తన నాలుకను పాముకు చూపించాడు రాజా. అయితే వెంటనే ఆ విషసర్పం రాజా నాలుకమీద కాలు వేసింది. . పాము విషయం ఎక్కడంతో రాజా కింద పడిపోయాడు. వెంటనే రాజా బంధువు కే సురేష్,ఇతర కుటుంబసభ్యులు రాజాని ఈరోడ్ హాస్పిటల్ కు తరలించారు.

Viral New: కోతికి జీవిత ఖైదు .. ఏం నేరం చేస్తే విధించారో తెలుసా..?

ఈరోడ్ మానియన్ మెడికల్ సెంటర్ చీఫ్ డాక్టర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ..నోటి నుంచి భారీగా రక్తం కారుతున్న స్థితిలో నవంబర్ 18న రాజా హాస్పిటల్ లో చేరాడు. పాము విషం కారణంగా రాజా నాలుక టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యాయి.బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు అతడి నాలుకను తీసేయాల్పి వచ్చింది. నాలుకను తొలగించిన తర్వాత కూడా పేషెంట్ ప్రాణలను కాపాడేందుకు నాలుగు రోజులు కష్టపడాల్సి వచ్చింది"అని తెలిపారు.

First published:

Tags: Snake bite, Tamilnadu

ఉత్తమ కథలు