హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లిలో మందు కొట్టాడు.. కాసేపటికే కంటిచూపు పోయి.. గుడ్డివాడయ్యాడు.. ఏం జరిగింది?

పెళ్లిలో మందు కొట్టాడు.. కాసేపటికే కంటిచూపు పోయి.. గుడ్డివాడయ్యాడు.. ఏం జరిగింది?

ఆస్పత్రిలో బాధితుడు

ఆస్పత్రిలో బాధితుడు

Adulterated liquor in Bihar: వివాహ వేడుకలో ముకేశ్ మద్యం సేవించాడని.. ఆ తర్వాత చూపు కోల్పోయాడని డాక్టర్‌కు చెప్పారు. వైద్యులు పరీక్షలు చేసి.. కల్తీ మద్యం తాగడం వల్లే ఇలా జరిగిందని వివరించారు.

అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మద్యం అమ్మినా..కొన్నా నేరమే..! కానీ ఇది కేవలం చట్టాల్లో మాత్రమే ఉంటుంది. ఆచరణలో మాత్రం కనిపించదు. అందుకే డ్రై స్టేట్‌లోనూ మద్యం ఏరులై పారుతోంది. ఎంతో మంది కేటుగాళ్లు అక్రమంగా మద్యం అమ్ముతూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగి సామాన్య ప్రజలు మత్తులో తూలుతున్నారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. మద్యపాన కేసులు మాత్రం భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ లోకో పైలట్ రైలును ఆపేసి.. మందుకొట్టేందుకు వెళ్లిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్‌లో మరో మద్యపాన ఘటన తెరపైకి వచ్చింది. కల్తీమద్యం తాగిన ఓ యువకుడు కంటి చూపు కోల్పోయాడు.

Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య.. భార్య కళ్లెదుటే భర్తను చంపేశారు

సరన్ జిల్లాలోని భోరహాన్ గ్రామానికి చెందిన ముకేశ్ ఠాకూర్ సెలూన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పక్క గ్రామంలోని వివాహ వేడుకకు హాజరయ్యాడు. అక్కడ జరిగిన మందు పార్టీలో మద్యం తాగాడు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నందున చాలా మంది కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన మద్యాన్ని పెళ్లి పార్టీలో ఇచ్చారు. మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత.. ముకేశ్ ఠాకూర్ కళ్లు మసకబారాయి. లోబీపీ అనుకొన్నాడు. కానీ మంగళవారం పరిస్థితి మరింత దిగజారింది. చూపు తక్కువ ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతడిని మష్రక్‌కు తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలో చూపించారు.

Affair: మాజీ లవర్ తో  ప్రాణ స్నేహితుడి ఎఫైర్.. యువకుడు ఏంచేశాడో తెలుసా..?

ఓ వివాహ వేడుకలో ముకేశ్ మద్యం సేవించాడని.. ఆ తర్వాత చూపు కోల్పోయాడని డాక్టర్‌కు చెప్పారు. వైద్యులు పరీక్షలు చేసి.. కల్తీ మద్యం తాగడం వల్లే ఇలా జరిగిందని వివరించారు. చికిత్స పొందినా అతడి ఆరోగ్యం మెరుపడలేదు. మరింత క్షీణించడంతో అతడిని చాప్రా సదర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ముకేశ్‌కు చికిత్స కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. బుధవారం సాయంత్రం డీఎస్పీ ఇందర్‌జిత్ బైతా, స్టేషన్ ప్రెసిడెంట్ వికాస్ కుమార్ సింగ్ టీమ్ ఫోర్స్‌తో భోరహన్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ విషయంలో ముఖేష్ ఠాకూర్ కుటుంబ సభ్యులు మాత్రం స్పష్టంగా ఏమీ చెప్పడం లేదు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

First published:

Tags: Bihar, Crime, Crime news