హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video : భర్తను క్రికెట్ బ్యాట్ తో చితక్కొట్టిన భార్య..గృహ హింస కేసు పెట్టిన భర్త

Viral Video : భర్తను క్రికెట్ బ్యాట్ తో చితక్కొట్టిన భార్య..గృహ హింస కేసు పెట్టిన భర్త

భర్తను క్రికెట్ బ్యాట్ తో కొడుతున్న భార్య

భర్తను క్రికెట్ బ్యాట్ తో కొడుతున్న భార్య

 Domestic violence against wife :  భర్తలు వేధిస్తున్నారంటూ భార్యలు గృహ హింస కేసలు పెడుతుండటం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే విచిత్రంగా ఓ భర్త..తన భార్య తనను వేధిస్తుందంటూ గృహ హింస కేసు పెట్టాడు.

Domestic violence against wife :  భర్తలు వేధిస్తున్నారంటూ భార్యలు గృహ హింస కేసలు పెడుతుండటం మనం సాధారణంగా చూస్తుంటాం. అయితే విచిత్రంగా ఓ భర్త..తన భార్య తనను వేధిస్తుందంటూ గృహ హింస కేసు పెట్టాడు. తన భార్య తనను భౌతికంగా, మానసికంగా హింసిస్తుందని,భార్య నుంచి రక్షణ కల్పించాలని కోర్టు మెట్లెక్కాడు. . రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడికి చెందిన అజిత్ సింగ్ యాదవ్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. అజిత్ సింగ్ యాదవ్ ఏడేళ్ల కిందట హర్యానాలోని సోనిపట్‌కు చెందిన సుమన్‌ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు. పెళ్లి అయిన కొన్నేళ్ల వరకు ఆ దంపతులు బాగానే ఉన్నారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య తరచుగా కొట్లాట జరుగుతున్నది. ఈ సందర్భాల్లో ప్రిన్సిపల్‌ను అతని భార్య ప్రతిరోజూ దారుణంగా కొట్టేస్తుంది. దీంతో విస్తుపోయిన ప్రిన్సిపల్ ఆధారాలు సేకరించేందుకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. భార్య సుమన్‌ తన భర్తను పలుమార్లు కిచెన్‌ వస్తువులు, కర్ర, క్రికెట్ బ్యాట్‌ వంటి వాటితో కొట్టిన దృశ్యాలు సీసీపుటేజీలో రికార్డయ్యాయి. వారి కుమారుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా ఆయనపై ఆమె దాడి చేసేది. భార్య ఇంత చేస్తున్నా అజిత్ సింగ్ యాదవ్ ఎప్పుడూ కూడా భార్యను తిరిగి కొట్టలేదు. ఆమెపై చేయి కూడా చేసుకోలేదు.

భార్య కొట్టినప్పుడల్లా తప్పించుకునేందుకు ప్రయత్నించేవాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన మహిళ అయిన భార్యపై చేయి చేసుకోవడం తన వృత్తి గౌరవానికి తగదని భావించాడు. దీంతో భార్య పెట్టే గృహ హింసను చాలా కాలం మౌనంగా భరించాడు. అయితే భార్య పరిధులు దాటి దాడులు చేయడాన్ని సహించలేక పోయాడు. దీంతో ఇప్పుడు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆయనకు భద్రత కల్పించాలని కోర్టు పోలీసులని ఆదేశించింది. ఇక, భార్య సుమన్... క్రికెట్‌ బ్యాట్‌తో భర్తను కొడుతున్న సీసీటీవీ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ALSO READ  OMG : 40 ఏళ్ల మహిళతో శృంగారం చేస్తూ..ప్రాణాలు కోల్పోయిన 61 ఏళ్ల వృద్ధుడు

మరోవైపు, మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌లో భార్య కొట్టిందని.. ఓ భర్త (Wife and husband Fight) ఫిర్యాదు చేశాడు. కంట్లో కారంపోసి కొట్టిందని.. ఆమె నుంచి కాపాడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అత్తింటి వారితో వేగలేకపోతున్నానని.. దయచేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా రితోరా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్ సింగ్‌కు గ్వాలియర్‌లోని మహల్‌గావ్ ప్రాంతానికి చెందిన పూజతో రెండేళ్ల క్రితం వివాహమైంది. సంజయ్ మలాన్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీలో ప్లంబర్‌గా పనిచేసేవాడు. పెళ్లయిన కొన్ని రోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఏం జరిగిదో ఏమో గానీ.. ఆ తర్వాత క్రమంగా విభేదాలు తలెత్తాయి. అత్తింటి వారిని పూజ అస్సులు గౌరవించేది కాదట. ఇంట్లో పనులు కూడా చేసేది కాదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. మూడు నెలల క్రితం అతడు ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో మే 31న సంజయ్ తల్లిదండ్రులను పూజ తిట్టిందట. మీ పేరెంట్స్ మంచి వారు కాదని అనడంతో సంజయ్‌కి కోపమొచ్చింది. భార్యను చెంపదెబ్బ కొట్టాడు. నీ వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని తిట్టాడు.

ALSO READ Video : షాకింగ్.. కూల్ డ్రింక్ లో బల్లి..మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌ లెట్‌ సీజ్

అనంతరం పూజను గ్వాలియర్‌లోని తన పుట్టింట్లో దింపడానికి వెళ్లాడు. సంజయ్ తన అత్తింటికి వెళ్లాక.. గొడవ మరింత పెద్దదయింది. తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి తన భర్త సంజయ్‌పై దాడి చేసింది పూజ. సంజయ్‌పై ఇటుకలతో కొట్టడమే కాకుండా.. కంట్లో కారం చల్లారు. అందరూ కలిసి సంజయ్‌ను చితకబాదారు. ఈ ఘటన అనంతరం అతడు నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. నా భార్య కంట్లో కారంపోసి కొట్టింది.. ఆమె నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. సంజయ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులను విచారిస్తున్నారు. ఒకవేళ వారు తప్పు చేశారని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ అమిత్ సంఘీ పేర్కొన్నారు.

First published:

Tags: Domestic Violence, Madhya pradesh, Rajastan, Viral Video