• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN LIVING WITH ROTTING CORPSE OF HIS MOTHER FOR A WEEK IN DELHI HERE IS SHOCKING DETAILS SK

10 రోజుల క్రితం తల్లి మృతి.. ఇంట్లోనే శవం.. కుళ్లిపోయి కంపు కొడుతున్నా పట్టించుకోని కొడుకు

10 రోజుల క్రితం తల్లి మృతి.. ఇంట్లోనే శవం.. కుళ్లిపోయి కంపు కొడుతున్నా పట్టించుకోని కొడుకు

ప్రతీకాత్మక చిత్రం

కుళ్లిపోయిన శవాన్ని చూస్తే వారం నుంచి 10 రోజుల మధ్యలో చనిపోయి ఉంటుందని వెల్లడించారు. ఆమె చివరగా పది రోజుల క్రితం కనిపించిదని ఇరుగుపొరుగు వారు కూడా చెప్పారు. ఆ తర్వాత ఇంటి నుంచి ఎలాంటి అలికిడి లేదని పేర్కొన్నారు.

  • Share this:
    ఇంట్లో తల్లీ కొడుకులు ఇద్దరే ఉంటారు. తల్లి వయసు 78 ఏళ్లు. కుమారుడి వయసు 54 ఏళ్లు. ఇటీవలే అనారోగ్యంతో అతడి తల్లి కన్నుమూసింది. చనిపోయి 10 రోజులవుతున్నా శవాన్ని తీయలేదు. కుళ్లిపోయి కంపు కొడుతున్నా అక్కడే ఉంటున్నాడు. ఇంటి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అప్పుడు విషయం బయటకు తెలిసింది. ఢిల్లీలోని ఉస్మాన్ పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ పక్క ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని చెప్పారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పరిశీలించారు. ఆ ఇంట్లో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఆమె కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు.

    మృతురాలి కుమారుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ భార్యాపిల్లలు దూరంగా ఉంటున్నారు. అతడు మద్యానికి బానిస కావడంతో పాటు మానిసిక సమస్యలు ఉన్నాయి. అందుకే తల్లి చనిపోయినా స్పందించడం లేదని పోలీసులు చెప్పారు. ఆమె ఎప్పుడు చనిపోయిందో ఖచ్చితంగా చెప్పలేమని.. ఐతే కుళ్లిపోయిన శవాన్ని చూస్తే వారం నుంచి 10 రోజుల మధ్యలో చనిపోయి ఉంటుందని వెల్లడించారు. ఆమె చివరగా పది రోజుల క్రితం కనిపించిదని ఇరుగుపొరుగు వారు కూడా చెప్పారు. ఆ తర్వాత ఇంటి నుంచి ఎలాంటి అలికిడి లేదని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమెది సహజ మరణమేనా? లేదంటే కుమారుడే చంపేశాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    2015లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. కోల్‌కతాలో పార్థో డీ అనే వ్యక్తి తన సోదరి, రెండు కుక్కల మృతదేహాలతో ఆరు నెలల పాటు ఉన్నాడు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థి పంజరాలుగా మారినా.. విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓ కేసు విషయమై అక్కడకు వెళ్లిన పోలీసులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని.. అందుకే సోదరి చనిపోయినా ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఢిల్లీ కేసు కూడా ఇలానే కనిపిస్తోంది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు