ఇద్దరు పిల్లల తల్లిని లవర్‌కి ఇచ్చి పెళ్లి చేయడానికి భర్త గ్రీన్ సిగ్నల్...

తన భార్యతో సామరస్యపూర్వకంగా విడిపోయేందుకు మహేష్ అంగీకరించాడు. ఆమె తన లవర్‌ను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

news18-telugu
Updated: November 26, 2019, 5:06 PM IST
ఇద్దరు పిల్లల తల్లిని లవర్‌కి ఇచ్చి పెళ్లి చేయడానికి భర్త గ్రీన్ సిగ్నల్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా తన భార్య తన మాజీ లవర్ మీద మనసు చంపుకోలేకపోవడం, దీంతో హీరో మనసుకరిగిపోయి.. తన భార్యను ఆమె కోరుకున్న ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనే సీన్లు మనం సినిమాల్లో చూస్తుంటాం. అయితే, అలాంటి ఘటన నిజంగానే జరిగింది. తనను పెళ్లి చేసుకుని, ఏడేళ్ల కాపురం చేసి, ఇద్దరు పిల్లలను కని.. చక్కగా కాపురం చేసుకుంటున్న భార్యకు సడన్‌గా ఆమె ప్రియుడు కనిపించడం, దాంతో ఆమె అతడితో వెళ్లిపోతాననడంతో భర్త.. భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. ఆమె లవర్‌కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఓకే చెప్పాడు. మధ్యప్రదేశ్‌లోని కోలార్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.

మహేష్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఏడేళ్ల క్రితం సంగీత అనే యువతితో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే, కొన్ని రోజుల క్రితం సంగీతకు ఆమె మాజీ ప్రియుడితో మళ్లీ పరిచయం పెరిగింది. తాను పెళ్లి చేసుకున్నా.. తన మాజీ లవర్ పెళ్లిచేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడంతో ఫిదా అయిపోయింది. దీంతో తాను అతడినే చేసుకుంటానని గొడవ మొదలు పెట్టింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె వినలేదు.

చివరకు భార్యాభర్తలు చర్చించుకుని విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తన భార్యతో సామరస్యపూర్వకంగా విడిపోయేందుకు మహేష్ అంగీకరించాడు. ఆమె తన లవర్‌ను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ, ఇద్దరు పిల్లలు మాత్రం తనకే కావాలని కోరాడు. సంగీతకు పిల్లలను చూడాలనిపిస్తే.. ఎప్పుడైనా రావొచ్చని ఆఫర్ ఇచ్చాడు.
First published: November 26, 2019, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading