Home /News /crime /

MAN LETS TWO RAPE WIFE FOR MONEY TO BUY LIQUOR IN GURUGRAM MS

భార్యను గదిలో బంధించి.. ఇద్దరితో రేప్ చేయించిన భర్త.. మద్యం కోసం దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 17న ఈ విషయం తన తల్లికి తెలియడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బిచోర్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. 376D(గ్యాంగ్ రేప్), 120B(నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    తాగుడుకు బానిసైన ఓ భర్త మద్యం కోసం కట్టుకున్న భార్యపై దగ్గరుండి మరీ అఘాయిత్యం జరిపించాడు. భార్యను ఇంట్లో బంధించి ఇద్దరు వ్యక్తులతో ఆమెపై అత్యాచారం చేయించాడు. మద్యానికి ఆ ఇద్దరు డబ్బులిస్తామని చెప్పడంతో భార్యపై ఇంత ఘోరానికి ఒడిగట్టాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

    బాధితురాలు పోలీసులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాగుబోతైన భర్త.. అతని బంధువు, పొరుగింటి వ్యక్తితో ఆమెపై అత్యాచారం జరిపించాడు. మార్చి మొదటివారంలో ఈ ఘటన జరిగింది. ముందుగా భార్యను ఇంట్లో బంధించి.. ఆపై ఆ ఇద్దరిని పిలిపించాడు. వారిద్దరు గదిలోకి వెళ్లి ఆమెపై బలత్కారం చేశారు. ఆరోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ పొరుగింటి వ్యక్తి మరుసటి రోజు కూడా ఇంటికి వచ్చాడు. దీంతో ఆమె తన భర్తతో గొడవ పడగా.. అతను విపరీతంగా కొట్టి, చంపేస్తానని బెదిరించాడు.

    అదే రోజు తన పిల్లలను తీసుకుని తాను పుట్టింటికి వచ్చానని బాధితురాలు తెలిపారు. అయితే మార్చి 17న ఈ విషయం తన తల్లికి తెలియడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బిచోర్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. 376D(గ్యాంగ్ రేప్), 120B(నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె భర్తతో పాటు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.త



    First published:

    Tags: Crime, Haryana, Liquor, RAPE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు