పెళ్లైన గంటసేపటికే భార్యను వదిలేసిన భర్త... రచ్చ రచ్చ మధ్య...

కులాలు వేరుకావడంతో పెళ్లికి ఒప్పుకోని కుటుంబసభ్యులు... ప్రేమ పెళ్లి విషయం తెలిసి కిడ్నాప్ కేసులు... భార్యను విడిచి కుటుంబసభ్యులతో వెళ్లిపోయిన ప్రియుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 7:59 PM IST
పెళ్లైన గంటసేపటికే భార్యను వదిలేసిన భర్త... రచ్చ రచ్చ మధ్య...
పెళ్లైన గంటసేపటికే భార్యను వదిలేసిన భర్త... కుటుంబం కోసం...
  • Share this:
పెళ్లైన గంటసేపటికే భార్యను వదిలేసి వెళ్లిపోయాడో భర్త. కుటుంబం కోసం ప్రేమను, ప్రేమించిన అమ్మాయినీ, ప్రేమపెళ్లిని రద్దుచేసుకుని వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో వెలుగుచూసింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల సెల్వ బాలాజీ... వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఆఫీసులో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 20 ఏళ్ల రోజాతో అతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఎవ్వరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ప్రేమించిన వ్యక్తిని మరిచి ఉండలేమని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకోవాలని బాలాజీ, పెళ్లైయితే వాళ్లే ఒప్పుకుంటారని రోజా భావిస్తూ వచ్చారు. ఇద్దరూ కలిసి శుక్రవారం సాయంత్రం బయటికి వెళ్లారు. ఆ సమయంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రోజా... బ్లేడుతో చెయ్యి కోసుకుంది. ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో కంగారు పడిన బాలాజీ... పళ్లిగొండలోని రంగనాథన్ ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమ పెళ్లి విషయం తెలుసుకున్న రోజా కుటుంబసభ్యులు... బాలాజీపై కిడ్నాప్ కేసు పెట్టారు. బాలాజీ కుటుంబసభ్యులు కూడా రోజా, తమ కొడుకును కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో ఇద్దరినీ పిలిపించి గుడియాత్తం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడాలని అనుకున్నారు రోజా, బాలాజీ. మున్సిపల్ ఆఫీసులో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన బాలాజీ... భార్యను వదిలి తన కుటుంబ సభ్యులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన భర్తను తనతో పంపించాలంటూ రోజా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలాజీ, రోజా కుటుంబసభ్యులకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు, ఇద్దరితో చర్చించారు. అయితే ఏమైందో ఏమోగానీ ఈ చర్చల తర్వాత బాలాజీ, తన భార్య రోజాను వదిలిపెట్టి చెన్నైకి వెళ్లిపోగా, రోజా తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. అసలేం జరిగిందో పోలీసులు గ్రహించేలోపే... అందరూ వెళ్లిపోయారు. కేసును స్వీకరించిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 6, 2019, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading