భార్య లెస్బియన్ అని తెలిసి...కక్ష పెంచుకొని...ముగ్గురు స్నేహితులను రేప్ చేయించి..

ఏడాది క్రితమే బాధితురాలికి వివాహం జరిగింది కానీ, పురుషుడిని వివాహం చేసుకోవాలని ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్). ఆ విషయం ఈ భర్తకు తెలియదు. ఏడాది పాటు బలవంతంగా వైవాహిక జీవితాన్ని నెట్టుకొచ్చిన బాధితురాలు, తర్వాత తన భర్త ఇంటిని వదిలి వెళ్లిపోయింది.


Updated: May 23, 2020, 10:16 PM IST
భార్య లెస్బియన్ అని తెలిసి...కక్ష పెంచుకొని...ముగ్గురు స్నేహితులను రేప్ చేయించి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కట్టుకున్న భర్తే...తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఇండోనేషియలోని జకార్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెరోం వృత్తిరీత్యా ఓ డాక్టర్ అయితే తన భార్య లెస్బియన్ గామారి మరో మహిళతో సంబంధం పెట్టుకుందని తెలిసింది. అంతేకాదు తన భర్తతో పడకను పంచుకునేందుకు ఇష్టపడలేదు. దాంతో ఆమె భర్త తీవ్ర కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఓ రోజు రాత్రి అతని ముగ్గురు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేశారు. నిజానికి ఏడాది క్రితమే బాధితురాలికి వివాహం జరిగింది కానీ, పురుషుడిని వివాహం చేసుకోవాలని ఆమెకు లేదు. ఎందుకంటే ఆమె స్వలింగ సంపర్కురాలు(లెస్బియన్). ఆ విషయం ఈ భర్తకు తెలియదు. ఏడాది పాటు బలవంతంగా వైవాహిక జీవితాన్ని నెట్టుకొచ్చిన బాధితురాలు, తర్వాత తన భర్త ఇంటిని వదిలి వెళ్లిపోయింది. ఎందుకు తనను వదిలేసి వెళ్లావని భర్త అడిగితే, తాను స్వలింగ సంపర్కురాలినని చెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత తీవ్రంగా కుమిలిపోయిన అతడు, తన స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. అనంతరం అతని కళ్ల ముందే, అతని అంగీకారంతోనే అతని ముగ్గరు స్నేహితులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లెస్బియన్ అన్న విషయాన్ని వెల్లడించడం వల్లనే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె అంటున్నారు.
First published: May 23, 2020, 10:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading