news18
Updated: November 12, 2020, 6:26 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 12, 2020, 6:26 AM IST
దేశ రాజధానికి సమీపంలో ఉన్న గురుగ్రాంలో నేరాలు నిత్యకృత్యమవుతున్నాయి. అక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. భార్యను చంపి.. శవాన్ని దుప్పట్లో కప్పి.. ఆ మృతదేహాన్ని గదిలోనే ఉంచి అక్కడ్నుంచి ఉడాయించాడు. చుట్టుపక్కల ఉంటున్నవారికి.. నిందితుడు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. గురుగ్రాంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
గురుగ్రాంలోని అశోక్ విహార్ ఫేజ్-3 ఏరియాలో అద్దె ఇంటిలో భరత్ థాపా.. తన భార్య నైనా సున్వర్ (35) తో నివాసముంటున్నాడు. ఆమెది నేపాలి. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా.. రెండ్రోజుల క్రితం ఆ ఇంటి యజమాని మొదటి అంతస్తులోని గ్యాలరీలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతకుముందే నాలుగు రోజుల నుంచి లాక్ చేసి ఉంచిన గది దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ ఏదో దుర్వాసన. అప్పటికే ఇరుగు పొరుగు వాళ్లు ఆ ఇంటి నుంచి ఏదో వాసన వస్తుందని చెప్పినా ఆ ఇంటి యజమాని పట్టించుకోలేదు. తీరా అక్కడకు వెళ్లి చూసేసరికి అదే నిజమైంది.దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు.
పోలీసులు వచ్చి తలుపు తెరిచి చూడంగానే ఇంట్లో ఎవరూ లేరు. అంతా చీకటి. తలుపులు తీయంగానే దుర్వాసన పెరిగింది. బెడ్ రూం వైపు వెళ్లిన పోలీసులకు బెడ్ మీద ఏదో ఒక మూటలా కనిపించింది. తీసి చూస్తే నైనా సున్వర్ మృతదేహం. ఆమెను గొంతు నులిమి చంపినట్టు పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించి ఆమె గొంతు దగ్గర కొన్ని గుర్తులు కూడా కనిపించాయని పోలీసులు తెలిపారు.
వారం రోజుల క్రితం భరత్ తనకు కనిపించాడని.. ఆ సమయంలో ఏదో హడావిడిగా ఇంటి పైకి మెట్లు ఎక్కేప్పుడు చూశానని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వాపోయాడు. భరత్ అక్కడికి సమీపంలో బర్గర్, ఫిజ్జా లు అమ్మే షాప్ లో పనిచేస్తాడని తెలిపాడు. అయితే గురువారం నాడే ఆయన.. నైనా ను చంపేసి.. శవాన్ని దుప్పట్లో కట్టేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by:
Srinivas Munigala
First published:
November 12, 2020, 6:26 AM IST