పరాయి స్త్రీ మోజులో పడి కట్టుకున్న భార్య గొంతు నులిమి...దారుణం...

శనివారం రాత్రి యాదమ్మ తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా, చుంచు స్వామి అదే రాత్రి భార్య యాదమ్మను గొంతు నులిమి, హత్య చేసి అదే రాత్రి ఇంటి నుంచి ఉడాయించాడు.


Updated: August 10, 2020, 10:20 PM IST
పరాయి స్త్రీ మోజులో పడి కట్టుకున్న భార్య గొంతు నులిమి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర బంధాల మోజులో పడి ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతును నిద్రలోనే నులిమి ఊపిరి ఆడకుండా చేసి ఉడాయించిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం, రాంసాగర్ గ్రామానికి చెందిన చుంచు స్వామి, భార్య యాదమ్మ ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడుతో కలిసి జీవిస్తున్నాడు. హమాలీ పనిచేసుకునే చుంచు స్వామికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య వద్దని వారించినా వినకుండా మహిళ వద్దకు వెళ్లేవాడు. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా పనుల్లేక రాంసాగర్ గ్రామంలో చుంచు స్వామి అత్తగారింట్లో భార్య పిల్లలతో ఉండేవాడు. శనివారం రాత్రి యాదమ్మ తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా, చుంచు స్వామి అదే రాత్రి భార్య యాదమ్మను గొంతు నులిమి, హత్య చేసి అదే రాత్రి ఇంటి నుంచి ఉడాయించాడు.

పొద్దునే యాదమ్మ విగత జీవిగా కనిపించడంతో పొద్దునే, పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 10:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading