Home /News /crime /

MAN KILLS WIFE FOR PUTTING EXCESS SALT IN KHICHDI ARRESTED IN MAHARASHTRA THANE MKS

Angry Husband: కిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపేసిన కోపధారి భర్త.. వీడు మనిషేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కిచిడీలో ఉప్పు ఎక్కువైందనే సాకుతో ఇల్లాలిని దారుణంగా చంపేశాడో శాడిస్టు మొగుడు. పొడవాటి గుడ్డతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు చెప్పిన వివరాలివే..

మహిళలపై దారుణాలు, గృహ హింసలో మారణకాండలకు సంబంధించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నం వండలేదనే కోపంలో, ఇష్టమైన కూరలు వండలేదనే ఉక్రోషంలో ఇంటి ఆడవాళ్లను తెగనరికిన తాగుబోతుల ఉదంతాలు మనకు తెలిసినవే. అయితే, మగాళ్లకు ఇష్టమైన వంటలు చేసిపెట్టినా కూడా మహిళలకు హింస తప్పడంలేదని, ఏదో ఒక వంకతో దాడి చేయడమే సైకోల లక్షణమని పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. తాజా ఘటనలో కిచిడీలో ఉప్పు ఎక్కువైందనే సాకుతో ఇల్లాలిని దారుణంగా చంపేశాడో శాడిస్టు మొగుడు..

ఉదయాన్నే టీతో పాటు టిఫిన్(అల్పాహారం) పెట్టలేదనే కోపంతో ఓ ముసలాయన కోడలిని తుపాకీతో కాల్చిన ఘటన మరువక ముందే అదే మహారాష్ట్రలో మరో మరో దారుణం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యని హత్య చేశాడో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

TRS Formation Day: 27న కేసీఆర్ యుద్దభేరీ -హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక వేడుక


మహారాష్ట్ర థానేలోని భయాందర్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న నీలేష్ ఘాగ్(46) తన భార్య చేసిన కిచిడీలో ఉప్పు ఎక్కువైందని ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం పొడవాటి గుడ్డతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Crime news, Husband kill wife, Maharashtra, Salt

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు