Husband kills wife: టైముకి భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త...

టైముకి భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త... (ప్రతీకాత్మకచిత్రం - source - youtube)

Husband kills wife in Telangana: ఈ రోజుల్లో మనుషుల్లో సహనం తగ్గిపోతోంది. చిన్న చిన్న అంశాలకే కంట్రోల్ కోల్పోయి నేరాలు చేస్తున్నారు. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
    సమయానికి భోజనం పెట్టలేదని ఎవరైనా భార్యను హత్య చేస్తారా... అలాంటి దారుణం... తెలంగాణ... రంగారెడ్డి జిల్లాలోని... మీర్పేటలో జరిగింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం... స్థానిక లారీ డ్రైవర్ శ్రీనుకూ, జయమ్మకూ 20 ఏళ్ల కిందట పెళ్లైంది. శుక్రవారం... జయమ్మ, ఆమె కొడుకూ ఓ పెళ్లికి వెళ్లారు. శ్రీను కూడా మరో వేడుకలో పాల్గొనేందుకు వెళ్లాడు. తర్వాత జయమ్మ, కొడుకూ ఇంటికి వచ్చారు. కాసేపటికే శ్రీను కూడా వచ్చాడు. తన కోసం అన్నం వండమని చెప్పాడు. లారీతో బయటకు వెళ్లాల్సిన పని ఉందన్నాడు. ఐతే... కాసేపటి తర్వాత చూస్తే... ఇంకా అన్నం రెడీ కాలేదు. త్వరగా వండమని చెప్పాడు. కాసేపటి తర్వాత మళ్లీ చూస్తే... అప్పటికీ వంట రెడీ అవ్వలేదు. దాంతో జయమ్మతో గొడవకు దిగాడు.

    జయమ్మ కూడా రివర్స్ అయ్యింది. "మేము పెళ్లికి వెళ్లకపోయి ఉంటే... వంట ఎప్పుడో రెడీ చేసేదాన్ని... అలా కంగారు పెడితే ఎలా" అని మండిపడింది. "ఆ వేడుకకు వెళ్లారు కదా... అక్కడే తిని రావాల్సింది" అని అంది. దాంతో శ్రీను మరింత రెచ్చిపోయాడు. "నోరు మూసుకొని వంట చెయ్... పిచ్చి పిచ్చిగా వాగకు" అంటూ మండిపడ్డాడు. "అంత అర్జెంటుగా ఉంటే... బయట ఎక్కడైనా తినండి... వంట అవ్వడానికి కొంత టైమ్ పడుతుంది" అంది ఆమె. "ఎందుకు పడుతుంది... ఎందుకు త్వరగా వండవు"... అంటూ... "నిన్నిలా కాదు"... అంటూ... ఆమె చీర కొంగును పట్టుకొని... ఆమె మెడకు చుట్టాడు. "చావవే చావు... నాకే ఎదురు తిరుగుతున్నావు... నీకు ఈమధ్య బాగా ఎక్కువైంది" అంటూ... బలవంతంగా గొంతు నొక్కాడు. దాంతో... జయమ్మ విలవిలలాడుతూ... వంట గదిలోనే ప్రాణాలు విడిచింది.

    ఇది కూడా చదవండి:Rape Case in AP: చోరీకి వచ్చి బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేసిన దొంగ... ఏపీలో దారుణం

    ఇదంతా జరుగుతున్నప్పుడు కొడుకు ఇంట్లో లేడు. అతను తిరిగి ఇంటికి వచ్చి చూస్తే... ఫ్లోర్‌లో తల్లి పడి ఉంది. తండ్రి లేడు. అమ్మను అటూ ఇటూ కదపగా... కదల్లేదు. వంట గదిలో సామాన్లు చిందర వందరగా కనిపించాయి. దాంతో ఏం జరిగిందో అర్థమైంది. విషయం తెలిసి స్థానికులు పరుగున వచ్చారు. పోలీసులకు కాల్ వెళ్లింది. ఐపీసీ సెక్షన్ 302 (Murder) ప్రకారం కేసు రాసిన పోలీసులు శ్రీను కోసం గాలిస్తున్నారు. "అయ్యో వంట లేటవుతోందని ఎవరైనా భార్యను చంపుకుంటారా" అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: