భార్య అందుకు అడ్డుగా ఉందని హత్య.. కొడుకునూ చంపి..

వెంకట్ రెడ్డి ఇలాగే భూములు అమ్మేస్తూ పోతే.. ఇక తమకు జీవనాధారం ఏమీ మిగలదని..భార్య కవిత పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. దీంతో పెద్ద మనుషులు మిగిలిన 4 ఎకరాల భూమిని ఆమె పేరు మీద పట్టా చేయాలని చెప్పారు.

news18-telugu
Updated: July 12, 2019, 9:35 AM IST
భార్య అందుకు అడ్డుగా ఉందని హత్య.. కొడుకునూ చంపి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 12, 2019, 9:35 AM IST
తాగుడుకు, జల్సాలకు అలవాటుపడ్డ ఓ భర్త.. కట్టుకున్న భార్యను,కుమారుడిని దారుణంగా హతమార్చాడు.తాగి తాగి.. చేసిన అప్పులు తీర్చేందుకు ఎకరా భూమి అమ్మేసిన అతను.. ఇటీవల మరో 4 ఎకరాలు అమ్మేందుకు సిద్దపడ్డాడు. అయితే అందుకు భార్య అడ్డు చెప్పుతుండటంతో.. ఆమెనే లేకుండా చేయాలనుకున్నాడు. ఆమెను హత్య చేస్తున్నప్పుడు చూశాడని.. కొడుకునూ చంపేశాడు. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కరస్‌గుత్తికి చెందిన వెంకట్‌రెడ్డికి, మహారాష్ట్ర బెజుల్‌వాడికి చెందిన కవితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దినేశ్(4) అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన కాపురంలో మద్యం చిచ్చు పెట్టింది. వెంకట్ రెడ్డి తాగుడుకి బానిసై భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తరుచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఇటీవల ఎకరా భూమిని అమ్మేశాడు.

వెంకట్ రెడ్డి ఇలాగే భూములు అమ్మేస్తూ పోతే.. ఇక తమకు జీవనాధారం ఏమీ మిగలదని..భార్య కవిత పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. దీంతో పెద్ద మనుషులు మిగిలిన 4 ఎకరాల భూమిని ఆమె పేరు మీద పట్టా చేయాలని చెప్పారు. చెప్పినట్టుగానే ఆమె పేరు మీద పట్టా జరిగిపోయింది. అయితే అప్పుల బాధకు.. ఉన్న 4 ఎకరాలు కూడా అమ్మేయాలని వెంకట్ రెడ్డి భావించాడు. అయితే పట్టా భార్య పేరు మీద ఉండటం.. భూమి అమ్మేందుకు ఆమె నిరాకరిస్తుండటంతో..ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం.. ఇంట్లోనే కవిత గొంతు నులిమి హత్య చేశాడు. భార్యను హత్య చూస్తుంటే చూశాడని.. కొడుకును కూడా హత్య చేశాడు. అనంతరం ఇద్దరి మృతదేహాలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆపై ఏమీ తెలియనట్టు.. గ్రామంలోనే కొద్దిసేపు అటూ ఇటూ తిరిగాడు. రాత్రి పూట ఇంటికొచ్చి.. భార్య,కొడుకు చనిపోయారని ఏడవడం మొదలుపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంకట్‌రెడ్డిపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...