Home /News /crime /

MAN KILLS WIFE AND SISTER IN LAW IN BHUBANESWAR PVN

Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..

భార్య,మరదలిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి

భార్య,మరదలిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి

Husband Kills Wife And Sister In Law : దారుణం జరిగింది. కుట్టుకున్న భార్య, ఆమె చెల్లెలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. భార్య,మరదలు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, అందువల్లే తాను ఇద్దరినీ హత్య చేశానని బిజయ్ కేతన్ చెబుతున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
Husband Kills Wife And Sister In Law : దారుణం జరిగింది. కుట్టుకున్న భార్య, ఆమె చెల్లెలిని అత్యంత దారుణంగా హత్య(Brutal Murder) చేశాడు ఓ వ్యక్తి. ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో గత గురువారం ఈ హత్యలు జరగ్గా..ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే తనను విసిగిస్తున్నారనే కోపంతేనే వారిని హత్య చేసినట్లు చెబుతున్నాడు నిందితుడు.

ఒడిషా(Odisha)కు చెందిన బిజయ్ ​కేతన్- గాయత్రిలకు 2011లో వివాహమైంది. వీరు భువనేశ్వర్ లోని చంద్రశేఖర్​పుర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. గాయత్రి చెల్లెలు సరస్వత కూడా అప్పుడప్పుడూ వీని ఇంటికి వస్తుండేది. సరస్వతి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. అయితే గత గురువారం సరస్వతి..అక్క ఇంటికి వచ్చింది. అయితే ఆ రోజు ఏమైందో ఏమీ తెలియదు బిజయ్​ కేతన్..తన భార్య,మరదలిని దారుణంగా హత్య చేశాడు. గాయత్రితో పాటు ఆమె చెల్లెలు సరస్వతిని హత్య చేసి.. మృతదేహాలను ఇంట్లో దాచాడు. మరోచోట బస చేస్తూ..రోజూ ఇంటికి వచ్చి మృతదేహాలను పరిశీలించి వెళ్లేవాడు బిజయ్ ​కేతన్. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే మృతులు గాయత్రి, సరస్వతి మొబైల్స్ స్విచ్చాఫ్ వచ్చేవి. దీంతో బిజయ్ ​కేతన్​కు ఫోన్ చేసినా అతడు లిఫ్ట్ చేయడం లేదు. దీంతో చంద్రశేఖర్ పూర్ పోలీస్ స్టేషన్ లో గాయత్రి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బిజయ్ కేతన్ ఇంట్లోంచి వస్తున్న దుర్వాసనతో పొరుగింటి వారికి ఏదో అనుమానం వచ్చిందది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ Shocking : ఎప్పుడూ ఫోన్ కాల్స్ లోనే..ఓ అర్థరాత్రి భార్యను అలా చూసిన భర్త..చివరికి

పోలీసులు ఆ ఇంటి డోర్లు తెరిచి చూసి షాక్ అయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న గాయత్రి-సరస్వతి మృతదేహాలను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బిజయ్‌కేతన్‌ చేసిన ఈ విపరీతమైన చర్య వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

నా ఇద్దరు కూతుళ్లను అల్లుడు చంపేశాడు. నా పెద్ద కూతురుని చంపేస్తానని బెదిరించేవాడు. నా ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం తమ బిడ్డలకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే భార్య,మరదలు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, అందువల్లే తాను ఇద్దరినీ హత్య చేశానని బిజయ్ కేతన్ చెబుతున్నట్లు సమాచారం.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Husband kill wife, Odisha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు