సొంత అల్లుడి తల నరికేసిన పిల్లనిచ్చిన మామ...షాకింగ్ ఘటన

గత రాత్రి అల్లుడు ఇంటికి రాగా అతడితో కలిసి సత్యనారాయణ మద్యం సేవించాడు. మద్యం మత్తులో తన భార్యను తానే చంపినట్లు మామ సత్యనారాయణతో చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశానికి లోనైన స‌త్య‌నారాయ‌ణ‌ ఉదయం అల్లుడు తల నరికేశాడు.

news18-telugu
Updated: August 9, 2020, 9:39 PM IST
సొంత అల్లుడి తల నరికేసిన పిల్లనిచ్చిన మామ...షాకింగ్ ఘటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పిల్లనిచ్చిన మామ సొంత అల్లుడి తల నరికి ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే రౌతులపూడి మండలం డి.జె.పురంలో పల్లా సత్యనారాయణ కుమార్తె గతేడాది అనుమానాస్పద స్థితిలో చ‌నిపోయింది. అప్పటి నుంచి ఆమె ఇద్ద‌రి కూతుళ్లు తాత సత్యనారాయణతోనే ఉంటున్నారు. కాగా గత రాత్రి అల్లుడు ఇంటికి రాగా అతడితో కలిసి సత్యనారాయణ మద్యం సేవించాడు. మద్యం మత్తులో తన భార్యను తానే చంపినట్లు మామ సత్యనారాయణతో చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశానికి లోనైన స‌త్య‌నారాయ‌ణ‌ ఉదయం అల్లుడు తల నరికి మనవరాళ్లతో సహా అన్నవరం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading