65 ఏళ్ల వృద్ద భార్యపై అనుమానం.. కనికరం లేకుండా హత్య చేశాడు..

చిలుకమ్మ ఇంట్లో అలికిడి లేదని గమనించిన ఇరుగుపొరుగు.. ఇంటి వైపు వచ్చి చూడగా.. ఆమె రక్తపు మడుగులో కనిపించింది.గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన బుచ్చయ్యను స్థానికుల సహాయంతో ఎంజీఎంకు తరలించారు.

news18-telugu
Updated: September 10, 2019, 9:01 AM IST
65 ఏళ్ల వృద్ద భార్యపై అనుమానం.. కనికరం లేకుండా హత్య చేశాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనుమానం పెనుభూతంగా మారి ఓ జీవితాన్ని బలితీసుకుంది. వృద్ద మహిళ అన్న కనికరం కూడా లేకుండా..భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో చిలుకమ్మ(65)-బుచ్చయ్య దంపతులు చాలా కాలంగా నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. కుమారుడు కొత్తగూడెంలో పనిచేస్తున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి.ఇంట్లో చిలుకమ్మ,బుచ్చయ్య మాత్రమే ఉంటున్నారు. కూలీ పనికి వెళ్లే చిలుకమ్మను బుచ్చయ్య కొన్నేళ్లుగా అనుమానిస్తున్నాడు.ఇదే విషయంపై ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు అయ్యేవి. సోమవారం కూడా ఇద్దరి మధ్య ఇదే విషయంపై గొడవ జరిగింది.బుచ్చయ్య కత్తి తీసుకుని చిలుకమ్మ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన గొంతు కూడా కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

చిలుకమ్మ ఇంట్లో అలికిడి లేదని గమనించిన ఇరుగుపొరుగు.. ఇంటి వైపు వచ్చి చూడగా.. ఆమె రక్తపు మడుగులో కనిపించింది.గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన బుచ్చయ్యను స్థానికుల సహాయంతో ఎంజీఎంకు తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading