గర్భిణి భార్యను చంపి రాత్రంతా మృతదేహంతోనే..మహారాష్ట్రలో దారుణం

కడుపుతో ఉన్న భార్యను భర్త చంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉస్మాన్ బాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒమెర్గా తెహ్‌సిల్ ప్రాంతంలో వినోద్ దాన్సింగ్ పవన్ అనే భార్య ప్రియాంక రాథోడ్‌తో కలిసి నివాసముంటున్నాడు

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 10, 2019, 7:18 PM IST
గర్భిణి భార్యను చంపి రాత్రంతా మృతదేహంతోనే..మహారాష్ట్రలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 10, 2019, 7:18 PM IST
కడుపుతో ఉన్న భార్యను భర్త చంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉస్మాన్ బాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒమెర్గా తెహ్‌సిల్ ప్రాంతంలో వినోద్ దాన్సింగ్ పవన్ అనే భార్య ప్రియాంక రాథోడ్‌తో కలిసి నివాసముంటున్నాడు. గురువారం రాత్రి భార్యభర్తలిద్దరి మధ్య ఏదో విషయమై గొడవ తలెత్తింది. దీంతో విచక్షణ కోల్పోయిన వినోద్ భార్య ప్రియంకపై దాడి చేశాడు. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి హత్యచేశాడు. దీంతో రాత్రంతా భార్య మృతదేహం పక్కనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయాన్నే లేచి వెళ్లి భార్యను హత్యచేసినట్లు నేరాన్ని అంగీకరించి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ప్రియాంక రాథోడ్ తుల్జాపూర్‌లో నర్స్‌గా పనిచేస్తుంది. పవన్, ప్రియాంకకు తొమ్మిదినెల కిందటే వివాహం జరిగినట్లుతెలుస్తుంది. ప్రస్తుతం ప్రియాంక ఐదునెలల గర్భవతి. అయితే మృతురాలి బంధవులు మాత్రం పవన్ తరచూ భార్య ప్రియాంకను వేధిస్తూ ఉండేవాడని... అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసేవాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిపై మర్డర్ కేసు నమోదు చేశారు. కేసును మరింతలోతుగా విచారణ చేస్తున్నారు.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు