• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • MAN KILLS MOTHER AND ANOTHER MAN MURDERS BROTHER IN MAHBUBNAGAR DISTRICT BA MBNR

Telangana: అన్నను కారుతో ఢీకొట్టి.. గొడ్డలితో నరికాడు.. అమ్మ ఇంకా చనిపోవట్లేదని...

Telangana: అన్నను కారుతో ఢీకొట్టి.. గొడ్డలితో నరికాడు.. అమ్మ ఇంకా చనిపోవట్లేదని...

ప్రతీకాత్మక చిత్రం

రోజురోజుకు మానవత్వం లేకుండా పోతుంది ఆస్తులు.... బంగారం.... కోసం ఏకంగా అమ్మ నాన్నా అన్న తమ్ముడు తేడా లేకుండా హత్యలు చేసుకుంటున్నారు.

 • Share this:
  (రఫీ, మహబూబ్ నగర్ కరస్పాండెంట్, న్యూస్ 18)

  రోజురోజుకు మానవత్వం లేకుండా పోతుంది ఆస్తులు.... బంగారం.... కోసం ఏకంగా అమ్మ నాన్నా అన్న తమ్ముడు తేడా లేకుండా హత్యలు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని నర్సమ్మ కు ఐదు మంది కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి అందరికీ పెళ్లిళ్లు చేసి ఎవరి సంసారం వారికి అప్పజెప్పిన కుమారులకు మాత్రం ఆమె పేరు మీద ఉన్న పొలం మీద కన్ను పడింది. ఇప్పుడిప్పుడే తల్లి చనిపోదు మాకు భాగాలు రావు అంటూ చిన్న కుమారుడు పొలంలో తల్లిని బండరాయితో అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం గుర్తుతెలియని దుండగులు మా తల్లిని హత్య చేశారంటూ చిత్రీకరించారు. చివరికి పోలీసులు చిన్న కుమారుడు విచారించిన అనంతరం ఆ హత్య చేసింది తానే అని ఒప్పుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఆస్తి కోసం తోడబుట్టిన అన్నను కిరాతకంగా హతమార్చిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఖాన్ పల్లి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం తండాకు చెందిన భగవత్ హనుమంతు 40 సంవత్సరాలు. ఆయన సోదరుడు భగవత్ శంకర్ మధ్య కొంతకాలంగా ఉన్నాయి. ఇదే క్రమంలో మరోమారు ఆస్తి విషయంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. బుధవారం రాత్రి వట్టెం వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామానికి వస్తున్న హనుమంతును గ్రామ సమీపంలో శంకర్ తన కారుతో ఢీ కొట్టాడు. గాయాలతో కిందపడిన అతనిపై గొడ్డలితో తలపై కాళ్లపై దాడి చేశాడు. దీంతో అన్న మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హనుమంతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై వెంకటేశ్వర్లు సంప్రదించగా హత్య జరిగింది వాస్తవమేనని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు