అతనికి 27 ఏళ్లు... ఆమెకు 45... పెళ్లి చేసుకోవాలంటూ... కత్తితో దాడి చేసి...

45 ఏళ్ల వివాహితతో ప్రేమలో పడ్డ 27 ఏళ్ల యువకుడు... భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు... ఎంతకీ వినకపోవడంతో అసహనంతో దాడి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 3:14 PM IST
అతనికి 27 ఏళ్లు... ఆమెకు 45... పెళ్లి చేసుకోవాలంటూ... కత్తితో దాడి చేసి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 3:14 PM IST
ప్రేమకీ, పెళ్లికీ వయసుతో సంబంధం లేదంటారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దగ్గర్నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దాకా ఈ విషయాన్ని చాలామందే నిరూపించి చూపించారు కూడా. తనకంటే వయసులో పెద్దదైన మహిళను పెళ్లిచేసుకోవడం కూడా పాపులారిటీని తెచ్చిపెట్టే విషయమే. అయితే తనకంటే 18 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ... ఎంతకీ వినకపోవడంతో అతిక్రూరంగా దాడి చేసి చంపేశాడో యువకుడు. దేశరాజధాని ఢిల్లీ శివారులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. శ్యామ్ యాదవ్ అనే 27 ఏళ్ల యువకుడు... బీహార్‌లోని మధుబాని జిల్లా పన్సల్వా గ్రామానికి చెందిన వ్యక్తి... ఢిల్లీకి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు.

ఓ షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న శ్యామ్ యాదవ్... తనతో పనిచేసే 45 ఏళ్ల మాధురి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే పెళ్లైన ఆమె... శ్యామ్ యాదవ్ ప్రేమను అంగీకరించలేదు. అయినా వదలని శ్యామ్ యాదవ్... భర్తకు విడాకులు ఇచ్చి, తనను పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధించేవాడు. దాంతో అతని వేధింపులు భరించలేక... సదరు మహిళ ఉద్యోగం కూడా మానేసింది. అయినా సరే మాధురిని వదిలిపెట్టని శ్యామ్ యాదవ్... ఆమె ఇంటికి వెళ్లి వేధించడం మొదలెట్టాడు. ఎంతకీ ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఆవేశానికి లోనైన శ్యామ్ యాదవ్... మాధురిపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. కూతురి ముందే మాధురిని కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వాళ్లు... మాధురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది మాధురి. సంఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... శ్యామ్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాధురిని చంపిన తర్వాత ఢిల్లీ విడిచిపోయేందుకు శ్యామ్ పక్కా ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు తేల్చారు పోలీసులు.

First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...