తన ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం పనోడిని చంపిన ఘనుడు...

హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు యాక్సిడెంట్... డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో కాలిబూడిదైన కారు... ప్రమాదం వెనక హత్య పథకం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 3:37 PM IST
తన ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం పనోడిని చంపిన ఘనుడు...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 6, 2018, 3:37 PM IST
తన ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం పనోడిని చంపాడో ఘనుడు. అవును... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... మనోడి పన్నిన పథకం గురించి తెలిస్తే మాత్రం ఔరా అని షాక్ అవుతారు. చంఢీఘర్‌లో ఉండే ఆకాశ్, ప్రీమా ఫేసీ, వారి కుటుంబ సభ్యులకు అందరిలాగే తేరగా వచ్చే డబ్బంటే ఆశ ఎక్కువ. అయితే ఇందుకోసం వారు లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీలను మార్గంగా ఎంచుకోవాలని భావించారు. భారీ మొత్తాలకు జీవిత భీమా చేసి... చనిపోయిన తర్వాత వచ్చే సొమ్ము కొట్టేయాలని పథకం పన్నారు. ఇందుకోసం వారి అల్లుడు రవి కుమార్ ఆలోచన కూడా తోడైంది.

కొన్నాళ్ల క్రితం ఓ ప్రమాదంలో కారు కాలిపోయి... ఆకాశ్ చనిపోయాడు. ఈ యాక్సిడెంటల్ డెత్‌కి సంబంధించిన కేస్ నేహాన్ పోలీస్ స్టేషన్‌లో నవంబర్ 20న నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని జుడ్డా కా జోహార్ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొన్న కారు... షాక్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా గాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో కారులోపల ఉన్న ఆకాశ్... పూర్తిగా దగ్ధమై చనిపోయాడని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాతి రోజు నుంచి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అతని కుటుంబసభ్యులు అధికారులను ఒత్తిడి చేస్తుండడం, భర్త చనిపోయాడనే బాధ ప్రీమా ఫేసీలో ఏ మాత్రం కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. అదే సమయంలో కూలీపని కోసం రాజస్థాన్ నుంచి చంఢీఘర్‌కు వచ్చిన నహాన్ అనే వ్యక్తి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదైంది. ఇతను ఆకాశ్ ఇంట్లో పనిచేస్తుండడంతో నహాన్ ఏమైం పోయాడనే కోణంలోనూ విచారణ ప్రారంభించారు పోలీసులు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

కారు ప్రమాదం జరిగినప్పుడు నహాన్, ఆకాశ్‌తో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు... ఆకాశ్ కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆకాశ్ పేరు మీద ఉన్న జీవిత భీమా డబ్బు కోసం నహాన్‌ను చంపేసి... కారుతో సహా కాల్చేసినట్టు ఒప్పుకుంది ప్రీమా ఫేసీ. భీమా సొమ్ము వచ్చే వరకు ఆకాశ్‌ వారణాసిలో ఉండాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే పథకం రివర్స్ తిరగడంతో పోలీసులకు చిక్కిన ఆకాశ్, ప్రీమా ఫేసీ, రవికుమార్... జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...