వయస్సు మరిచిపోయింది. వావీ వరుస కూడా మరిచిపోయింది. కామంతో కళ్లుమూసుకొని పోయి కన్న కొడుకు స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమె... చివరకు భర్త చేతిలో హతమైంది. వివరాలిలా ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పట్ణణంలోని కరీం దంపతులకు పంతొమ్మిదేళ్ళ కుమారుడున్నాడు. భర్త వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతని భార్య... తన కుమారునితో వచ్చే యువకుడైన షఫీపై మనసుపడింది. ఈ క్రమంలో... ఆ అబ్బాయిని రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతడికి తన పరువాలతో ఆకట్టుకొని ముగ్గులోకి దింపింది. తర్వాత అతడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అతడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ మరీ తన కోర్కెలు తీర్చుకునేది. కాగా... ఆ అబ్బాయి... ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి వెళుతున్నాడని భర్త తరపు బంధువులు ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు. ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి రాగా బెడ్రూంలో భార్య ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రియుడు షఫీతో కలిసి ఎంజాయ్ చేస్తుండడం చూసి షాక్ తిన్నాడు.
ఆ క్రమంలోనే... ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియుడిని కూడా హతమార్చబోగా అతడు బయటకు పరుగులు తీశాడు. అతడిపై దాడి చేయగా తప్పించుకున్నాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
Published by:Krishna Adithya
First published:January 17, 2021, 01:16 IST