భార్యను చంపి భర్త ఆత్మహత్య.. పెరోల్‌పై జైలు నుంచి బయటకొచ్చి..

తాను జైల్లో ఉన్న సమయంలో తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని శంకర్ అనుమానించాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్యచేసి.. తాను ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు.

news18-telugu
Updated: July 9, 2020, 1:47 PM IST
భార్యను చంపి భర్త ఆత్మహత్య.. పెరోల్‌పై జైలు నుంచి బయటకొచ్చి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యపై అనుమానం పెంచుకొని ఆమెను దారుణంగా చంపేశాడో భర్త. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటవవలే పెరోల్‌లపై జైలు నుంచి విడుదలై ఈ ఘోరానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డికి చెందిన శంకర్ ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2013లో జరిగిన హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి జిల్లా జైలులో ఉంటున్నాడు. ఐతే శంకర్ సత్ప్రవర్తన కారణంగా జూన్ 25న అతడిని 14 రోజుల పెరోల్‌పై విడుదల చేశారు.

తాను జైల్లో ఉన్న సమయంలో తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని శంకర్ అనుమానించాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్యచేసి.. తాను ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. రెండు రోజులుగా భార్యాభర్తలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు తలుపులు పగులకొట్టి లోపలికి వెళ్లి చూడా.. ఇద్దరూ విగత జీవులుగా పడిఉన్నారు. ఈ నెల 7న వీరు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శంకర్ గడువు జూలై 11తో అతని పెరోల్‌ గడువు ముగియనుంది. అంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading