హోమ్ /వార్తలు /క్రైమ్ /

Husband Kills Wife: వంట సరిగా చేయలేదని భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..

Husband Kills Wife: వంట సరిగా చేయలేదని భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Husband Kills Wife: రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన సదరు భర్త.. భోజనం వడ్డించాలని భార్యను ఆదేశించాడు. తీరా ప్లేట్ లో అన్నం పెట్టాక.. వంట సరిగా లేదని భర్తతో గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న రోకలి బండతో తలమై మోదాడు.

  • News18
  • Last Updated :

వాళ్లిద్దరికీ పెళ్లై చాలా కాలమైంది. ఆ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కొద్దికాలంగా ఆ భర్త మరో స్త్రీ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా భార్యాభర్తలిద్దరూ తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య సఖ్యత కూడా లేదు. ఇదే క్రమంలో ఆ భర్త ఫుల్లుగా తాగి ఇంటికి రావడం.. ఇంట్లో నానా యాగి చేయడం.. ఇది ఆ భార్య తో పాటు ఇద్దరు కూతుళ్లకు కూడా విసుగు తెప్పించేది. పలు మార్లు తండ్రికి కూతుళ్లు కూడా చెప్పి చూశారు. కానీ మార్పు శూణ్యం. ఇదే క్రమంలో నిన్న రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చిన సదరు భర్త.. భోజనం వడ్డించాలని భార్యను ఆదేశించాడు. తీరా ప్లేట్ లో అన్నం పెట్టాక.. వంట సరిగా లేదని భర్తతో గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న రోకలి బండతో తలమై మోదాడు. దీంతో ఆమె అక్కడే పడిపోయింది. నాగర్ కర్నూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన గడ్డి లక్ష్మయ్య ఆయన భార్య లక్ష్మమ్మల కాపురం కొద్దికాలంగా సరిగా సాగడం లేదు. వారి మధ్య నిత్యం గొడవలే. ఇదే క్రమంలో శనివారం అర్ధరాత్రి దాకా మద్యం తాగి ఇంటికి వచ్చిన లక్ష్మయ్య.. వంట సరిగా లేదని భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. దాడికి దారి తీసింది. తన మీదకే ఎదురు మాట్లాడుతుందని.. లక్ష్మయ్య అక్కడే ఉన్న రోకలిబండతో లక్ష్మమ్మ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె ఎంతకూ లేవలేదు.

కాగా... మద్యం మత్తులో ఉన్న లక్ష్మయ్య ఆమె పరిస్థితి పట్టించుకోకుండా అలాగే నిద్ర పోయాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కుమార్తెలు తల్లి గాయపడి పడుకుంది అనుకున్నారు. కానీ ఉదయం లేచి చూసేసరికి కూడా ఆమె అలాగే పడుకుని ఉంది. అనుమానం వచ్చిన ఇద్దరు కుమార్తెలు.. ఆమెను నిద్రలేపడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అప్పటికే శాశ్వత నిద్రలోకి జారిపోయింది.

అయితే లక్ష్మయ్య కు మరొక స్త్రీ తో వివాహేతర సంబంధం కూడా ఉన్నదని.. దాని కారణంగానే ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Husband kill wife, Nagarkurnool, Telangana, Telangana News

ఉత్తమ కథలు