Home /News /crime /

MAN KILLS HIS WIFE BECAUSE OF EXTRA MARITAL AFFAIR IN VIJAYANAGARAM DISTRICT AK

భార్యపై అనుమానం.. కత్తితో పొడిచి చంపిన భర్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... ఆమెను కత్తి పొడిచి చంపాడు.

    రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. లాక్‌డౌన్ కారణంగా సొంత ఊరికి వెళ్లేందుకు సిద్ధమైన ఆ భార్యభర్తలు... సొంత జిల్లాకు చేరుకోగానే గొడవ పడ్డారు. ఆ గొడవ చివరకు భార్యను భర్త హత్య చేసేంతవరకు వెళ్లింది. నెల్లూరు నుంచి సింహాచలం అతడి భార్య సుజాత కలిసి మంగళవారం రాత్రి విజయనగరం జిల్లా చేరుకున్నారు. వీరు సీతానగరం మండలం కొత్తవలసకు వెళ్లాల్సి ఉంది. అయితే అంతలోని వారి మధ్య జరిగిన గొడవ... భార్య ప్రాణం పోయేలా చేసింది. కొంతకాలంగా వివాహేతర సంబంధాల కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే మంగళవారం రాత్రి వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

    భార్య సుజాతపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె భర్త సింహాచలం... ఆమె గుండెల్లో కత్తిని దింపాడు. ఇది చూసిన చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణపాయస్థితిలో ఉన్న సుజాతను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. నిందితుడు సింహాచలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Vijayanagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు