• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN KILLS HIS LIVING IN PARTNER AND ELOPES WITH ANOTHER WOMAN IN HARIDWAR SK

ప్రియురాలిని చంపేసి.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి.. మరో మహిళతో పరారీ

ప్రతీకాత్మక చిత్రం

సూట్ కేసులో ఆమె డెడ్ బాడీ లభ్యమైంది. అదే సమయంలో అపార్ట్‌మెంట్‌లోని మరో మహిళ ఆచూకీ కూడా గల్లతయింది. ఈ నేపథ్యంలో మృతురాలి ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని.. అనంతరం ఆ మహిళతో పారిపోయాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

  • Share this:
    ప్రియురాలిని గొంతు నులిమి చంపేశాడో ప్రియుడు. ఆమె శవాన్ని సూట్ కేసులో కుక్కి.. మరో మహిళతో పారిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో శుక్రవారం ఈ ఘటన చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన నిందితుడు (26), మధ్యప్రదేశ్‌కు చెందిన బాధితురాలు (23) హరిద్వార్‌లో ఒకే కంపెనీలో పనిచేసే వారు. గతంలో ఢిల్లీ, గ్వాలియర్‌లోనూ కలిసి పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరచియం.. ఆ తర్వాత ప్రేమగా మారి, సహజీవనానికి దారితీసింది. వీరి హరిద్వార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఇరువురూ బాగానే ఉన్నారు. ఐతే అదే భవనంలో మరో మహిళలతో నిందితుడు సన్నిహితంగా ఉండేవాడు.

    ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లోని అతడి గది నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తాళం పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. మహిళ మృతదేహం కనిపించింది. సూట్ కేసులో ఆమె డెడ్ బాడీ లభ్యమైంది. అదే సమయంలో అపార్ట్‌మెంట్‌లోని మరో మహిళ ఆచూకీ కూడా గల్లతయింది. ఈ నేపథ్యంలో మృతురాలి ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని.. అనంతరం ఆ మహిళతో పారిపోయాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆ మహిళ కోసమే ప్రియురాలిని గొంతు నులిమి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఇద్దరినీ త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: